Begin typing your search above and press return to search.

3 నెలల్లోనే 32వేల కోట్లు కొట్టేశారు..

By:  Tupaki Desk   |   9 Sep 2019 7:02 AM GMT
3 నెలల్లోనే 32వేల కోట్లు కొట్టేశారు..
X
బడా పారిశ్రామికవేత్త - లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు 8వేల కోట్లకు పైగా ముంచి బ్రిటన్ పారిపోయాడు.. ఆ తర్వాత ఈయనను మించి నీరవ్ మోడీ 12వేల కోట్లు జాతీయ బ్యాంక్ లకు టోకరా కట్టి ఇదే బ్రిటన్ కు చెక్కేశాడు. ఆ మొత్తం తిరిగివచ్చింది లేదు.. రికవరీ అయ్యింది లేదు.. వాళ్లకు శిక్షలు పడింది లేదు. బ్యాంకులను బొక్కేసి విదేశాల్లో వారు ఎంజాయ్ చేస్తున్నారు .

అయితే బ్యాంకులను ముంచడం వారితోనే ఆగిపోయిందని అనుకుంటే మీరు బ్యాంకులో కాలేసినట్టే.. ఎందుకంటే వారు వెళ్లాక కూడా కొనసాగుతోంది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ మోసాలు వెలుగుచూశాయి.

మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ తాజాగా భారత రిజర్వ్ బ్యాంక్ ను సమాచార హక్కు చట్టం ద్వారా బ్యాంకు మోసాలపై దరఖాస్తు చేయగా కళ్లు చెదిరే మోసాలు బయటపడ్డాయి..

ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 31898 కోట్లు అంటే దాదాపు 32వేల కోట్ల మేర మోసాలు జరిగినట్టు ఆర్బీఐ తాజాగా సహచట్టం ద్వారా తెలిపింది. ఇందులో అత్యధికంగా 38శాతం మోసాలు అంటే 12012 కోట్లు - 1197 మోసాలు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే జరిగాయని ఆర్బీఐ తెలిపింది. ఆ తర్వాత అలహాబాద్ బ్యాంకులో రూ.2855 కోట్లను 381మంది మోసం చేసి కొల్లగొట్టారని తెలిపింది. మూడో స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఇందులో 99 మోసాలు జరిగి 2526 కోట్లు మోసపోయాయని తెలిపింది.

అలా మోసగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. బ్యాంకులు మోసపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మోసగాళ్లు వల్ల నిజమైన లబ్ధిదారులను కూడా బ్యాంకులు నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి తటపటాయిస్తున్నాయి. బ్యాంకులకు మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.