Begin typing your search above and press return to search.

కొడుకు క్వారెంటైన్ కు ససేమిరా..తెలంగాణ డీఎస్పీపై కేసు

By:  Tupaki Desk   |   23 March 2020 2:22 PM GMT
కొడుకు క్వారెంటైన్ కు ససేమిరా..తెలంగాణ డీఎస్పీపై కేసు
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా కట్టడి కోసం ఆయా దేశాలు - రాష్ట్రాలు సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు తీసుకుంటూ... తమ ప్రజలను కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతుంటే... ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను అమలు చేయాల్సిన గురుతర బాధ్యతను మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై ఏకంగా కేసు నమోదైపోయింది. ఇప్పటికే స్వీయ నిర్బంధం - ప్రభుత్వ సూచనలను పాటించని వారిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిన పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించడం సబబు కాదు కదా. అందుకే ఆ పోలీసు అధికారిపై తెలంగాణ సర్కారు ఏకంగా కేసు నమోదు చేసేిపారేసింది.

ఆసక్తిగానే కాకుండా మనందరికీ డేంజర్ బెల్స్ వినిపించేలా ఉన్న ఈ వార్త వివరాల్లోకి వెళితే... లండన్ లో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి ఇటీవలే తిరిగి వస్తే... తెలంగాణలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) స్థాయిలో ఉన్న అతడి తండ్రి అతడిని సెల్ఫ్ క్వారెంటైన్ కు పంపకుండా బయటకు వదిలేశాడట. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛతో ఆ విద్యార్థి తన మిత్రులు - బంధువులు చాలా మందితో కలిసి తిరిగాడట. తీరా జలుబు చేసిందని పరీక్షలు చేయించుకుంటే... ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో అతడితో కలిసిన వారు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన ప్రభుత్వ యంత్రాంగం... అతడిని ఐసోలేషన్ కు తరలించి... అతడు కలిసిన వారెవరన్న వివరాలను సేకరించే పనిలో పడిందట.

ఈ మొత్తం తతంగానికి కారకుడైన ఆ విద్యార్థి తండ్రి ఎవరని ఆరా తీయగా... ఆయన ఓ డీఎస్పీని అని తేలడంతో అధికార యంత్రాంగం షాక్ తిన్నదట. ప్రస్తుతం కొత్తగూడెం డీఎస్పీగా పనిచేస్తున్న సదరు పోలీసు అధికారి తన కుమారుడిని సెల్ఫ్ క్వారెంటైన్ కు పంపి ఉంటే... ఇంత జరిగేది కాదు కదా అన్న భావనతో ఆ డీఎస్పీపై చర్యలకు ఉపక్రమించారట. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా సదరు డీఎస్పీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సదరు డీఎస్పీ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సిందేనన్న భావనతో ఆయనపై కేేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందట. దీంతో డీఎస్పీపైనే పోలీసులు కేసు నమోదు చేసేశారట.