Begin typing your search above and press return to search.
ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్మరణం.. కేంద్రం కీలక నిర్ణయం!
By: Tupaki Desk | 16 Dec 2022 1:30 AM GMTమూడు నెలల క్రితం టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అత్యంత ఖరీదైన బెంజ్ కారులో ఆయన ప్రయాణిస్తున్నప్పటికీ ఆయన ప్రమాదంలో మృతి చెందడం అందరినీ నివ్వెరపరిచింది.
అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న బెంజ్ కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వంతెన గోడ వద్ద క్రాష్ బారియర్లు ఉంటే.. ప్రమాద తీవ్రత తగ్గేదేమో అనే అభిప్రాయాలూ వినిపించాయి.
కారు అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, ప్రమాదం జరిగిన వంతెన వద్ద క్రాష్ బారియర్లు లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమైనట్టు వార్తలు వచ్చాయి. విచారణ కమిటీ సైతం ఇదే తేల్చింది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వంతెనలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వంతెనల వద్ద వాహనాల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రిడ్జీలపై రెయిలింగ్స్ తొలగించి.. వాటి స్థానంలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా వంతెనలపై రెయిలింగ్స్‌ను తొలగించి క్రాష్ బారియర్లను ఏర్పాటు చేసే అంశంపై కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, జాతీయ ర హదారుల సంస్థకు ఒక సర్క్యులర్ జారీ చేసింది.
కాగా.. వంతెనలపై రాకపోకలు సాగించే వాహనాలకు భద్రత కల్పించేందుకు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయడం అత్యవసరం. అయితే, ప్రస్తుతం ఉన్న వంతెనలను వెడల్పు చేయకుండా వాటి రెయిలింగ్స్‌ను మార్చడం సరైన పరిష్కారమా? కాదా? నిర్మాణపరంగా సమర్థంగా ఉంటుందా? లేదా? అనే విషయాలను కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. అయితే, రెయిలింగ్స్ స్థానంలో క్రాష్ బారియర్లను ఏర్పాటు చేసేముందు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్రాలకు జారీ చేసిన సర్క్యులర్‌లో కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్రాష్ బారియర్ల నిలువు పటిష్టత, డిజైన్ లోడ్, కాంక్రీట్ నాణ్యతను తనిఖీ చేయాలి అని రాష్ట్రాలకు, జాతీయ రహదారుల సంస్థకు సూచించింది.
ఇక నుంచి ఫుట్‌పాత్ ఉన్నా, లేకపోయినా కొత్తగా నిర్మించే వంతెనలకు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని ఆ సర్క్యులర్‌లో కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది.
రెండు లేన్లతో ఉన్న వంతెనలన్నీ వెడల్పు చేసినా, చేయకపోయినా లోపలి వైపు క్రాష్ బారియర్లు, బయటివైపు పాదచారుల రెయిలింగ్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది. ఇక నాలుగు లేన్లతో ఉన్న వంతెనలకైతే.. రెయిలింగ్స్‌ను తొలగించి వాటి స్థానంలో క్రాష్ బారియర్లను అమర్చాలి అని స్పష్టం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.