Begin typing your search above and press return to search.

మందుబాబులకు ప్రభుత్వం మరో షాక్ !

By:  Tupaki Desk   |   2 Jun 2020 4:45 AM GMT
మందుబాబులకు ప్రభుత్వం మరో షాక్ !
X
వైరస్ ను అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలని మూసేసిన సంగతి తెలిసిందే. అయితే, మూడోదశ లాక్ డౌన్ ను ప్రకటించిన సమయంలో కేంద్రం మద్యం అమ్మకాలకి సడలింపులు ఇచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు మళ్లీ ప్రారంభమైయ్యాయి. చాలారోజుల తరువాత మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో మందుబాబులు మద్యం షాప్స్ ముందు బారులు తీరారు.

ఇకపోతే , ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పై వైరస్ పన్ను విధించనుంది. అయితే ,. ఈ వైరస్ పన్ను విధించింది ఏపీ ,తెలంగాణ ప్రభుత్వం కాదు..చంఢీగర్ ప్రభుత్వం. మద్యంపై వైరస్‌ పన్ను విధిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. దాంతోపాటు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేటగిరీలను బట్టి మద్యం ధరలు రూ.2 నుంచి.. రూ.50 వరకు పెరుగనున్నాయి.

తాజా పెంపుతో ప్రభుత్వానికి రూ.145 కోట్ల అదనంగా లభించనుంది. వైరస్ నియంత్రణ చర్యలు, లాక్ ‌డౌన్‌ విధింపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఇక పంజాబ్‌ రాష్ట్రంలో దాదాపు 26 వేల కోట్ల ఆర్థికలోటు ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మద్యంపై వచ్చే అదనపు ఆదాయం వైరస్ నియంత్రణ చర్యలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. వైరస్ సెస్సు నేటి నుంచే అమల్లోకి రానుండటం విశేషం.