Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహం.. ఎక్కడ కొలువు దీరబోతుదంటే?

By:  Tupaki Desk   |   23 Dec 2022 7:52 AM GMT
ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహం.. ఎక్కడ కొలువు దీరబోతుదంటే?
X
సంస్కృతి.. సంప్రదాయాలకు భారత్ కేరాఫ్ గా నిలుస్తోంది. విదేశీయులు సైతం మన సంప్రదాయాలకు ముగ్ధులై మనల్ని ఫాలో అయ్యేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారత్ కు వచ్చే పర్యాటకులకు మనదేశంలోని ఆధ్యాత్మిక ఆలయాలు.. ఇతర ప్రాంతాలను చూసేందుకు మక్కువ చూపుతుంటారని అందరికీ తెల్సిందే..!

కేంద్రం.. ఆయా రాష్ట్రాలు సైతం ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆలయాలు.. విగ్రహాలను సైతం ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ముందుండి పనులు చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామమందిరం నిర్మాణానికి తన వంతు సహకారం అందించింది.

తాజాగా గుజరాత్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ద్వారకా జిల్లాలోని దేవభూమి ద్వారకా కారిడార్ ప్రాంతంలో భారీ కృష్ణుడి విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ ప‌టేల్ తెలిపారు.

ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి విగ్రహానికి సంబంధించిన మొదటి దశ పనులు 2023 సెప్టెంబర్లో ప్రారంభించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హృషికేష్ పటేల్ వివరించారు. దేవ‌భూమి ద్వార‌కా కారిడార్‌లో ద్వార‌కాధీష్ ఆల‌యంలో త్రీడీ ఇమ్మ‌ర్సివ్ ఎక్స్‌పీరియ‌న్స్ జోన్‌.. శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్గీత అనుభ‌వ క్షేత్రాన్ని సైతం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణ‌యించిందని తెలిపారు.

గుజరాత్ లోని ప‌లు ఆధ్యాత్మిక కేంద్రాల‌కు దేవ భూమి ద్వార‌కా కారిడార్‌ను నిలయంగా మార్చ‌డం ద్వారా ప‌శ్చిమ భార‌త‌దేశంలోనే ఈ క్షేత్రం అతిపెద్ద ఆధ్యాత్మిక‌ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ అతిపెద్ద కృష్ణుడి విగ్రహానికి సంబంధించిన పనులు చేపడుతామన్నారు.

ఈ ప్రాజెక్టు మొదటి దశలో పురాతన ద్వారక నగరానికి సంబంధించిన అవశేషాలను ప్రజలు తిలకించేలా గ్యాలరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో గుజరాత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.