Begin typing your search above and press return to search.
మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి అంత్యక్రియలు ఇలా చేస్తారు..
By: Tupaki Desk | 18 May 2020 8:10 AM GMTమహమ్మారి వైరస్ బారిన పడి మృతి చెందిన వారి అంత్యక్రియలకు ఎంతో జాగ్రత్తగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆ వైరస్‌ను ఇతరులకు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని వారి తుది ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే మహమ్మారి బారిన పడిన వారి మృతదేహాన్ని తాకడం.. దగ్గరకి వచ్చి చూడడం వంటివి అనుమతించడం లేదు. ఎందుకంటే మృతదేహం నుంచి ఇతరులకు మహమ్మారి సోకే ప్రమాదం ఉంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు వ్యతిరేకిస్తున్నా అందరి ఆరోగ్యం కోసం వైద్యారోగ్య శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని అంత్యక్రియల తంతు ముగిస్తున్నారు. దీనిపై చాలా చోట్ల వ్యతిరేకత వస్తున్నా అది మనందరి ఆరోగ్యం కోసమే ఆ విధంగా చేస్తున్నారని గుర్తించాలి. ఈ సందర్భంగా మహమ్మారి బాధితులు మృతి చెందితే వారి అంత్యక్రియలు ఏ విధంగా చేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకోండి.
- మహమ్మారితో కన్నుమూసిన వ్యక్తి శరీరాన్ని ముందుగా సోడియం హైపోక్లోరైట్ ద్రావకం తో స్పాంజ్ బాత్ చేయిస్తారు.
- ముఖం మినహా మృతదేహాన్ని తెల్లటి వస్త్రంలో చుడతారు. ఆపై మళ్లీ ఒక్కశాతం సోడియం హైపోక్లోరైట్‌ను చల్లుతారు.
- నలభై నిమిషాల అనంతరం ప్రత్యేకంగా తయారుచేసిన నల్లటి జిప్ బ్యాగ్‌లోకి మృతదేహాన్ని మారుస్తారు.
- అంబులెన్స్ లోపలంతా సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేస్తారు. అనంతరం పోలీసు ఎస్కార్ట్‌తో భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తీసుకెళతారు.
- ఆఖరి చూపునకు ఐదుగురు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తారు. అదీ నాలుగు మీటర్ల దూరం నుంచి మాత్రమే చూడాల్సి ఉంది.
- అంత్యక్రియల్లో పాల్గొనే సిబ్బంది పీపీఈ, హ్యాండ్ గ్లౌవ్స్, మాస్కు, కళ్లజోడు తప్పనిసరిగా ధరిస్తారు. ఆ సమయంలో వారి చేతులకు, మృతదేహానికి కానీ ఏమాత్రం తడి తగలకుండా జాగ్రత్తపడతారు.
- అంతిమ సంస్కారాల్లో ఖననం అయితే, ఎనిమిది అడుగుల గుంతలో మృతదేహాన్ని పూడుస్తారు. మధ్యలో మట్టితో పాటూ బ్లీచింగ్‌నూ వాడతారు. ఆ వైరస్ బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
- మృతదేహాన్ని దహనం చేసేప్పుడు పొగ ఎక్కువ రాకుండా జాగ్రత్తపడతారు.
- చితాభస్మాన్ని తీసుకోవడానికి అనుమతిస్తారు.
- అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతం పరిసరాల్లో ఒకటికి రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని పిచికారీ చేస్తారు. వైరస్ ఆనవాళ్లు లేకుండా ఈ విధంగా చేస్తారు.
- అనంతరం మళ్లీ అంబులెన్స్ వాహనాన్ని సోడియంహైపోక్లోరైట్‌తో శుభ్రం చేస్తారు.
- అంత్యక్రియల్లో పాల్గొన్న సిబ్బంది వాడిన పీపీఈ కిట్, మాస్కు, గ్లౌవ్స్, కళ్లజోడు వంటి వాటన్నింటిని తీసి, సోడియం హైపోక్లోరైట్ ద్రావకంతో డీవైరల్ చేసి ఒక పసుపు రంగు సంచిలో ఉంచుతారు. వాటిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక సిబ్బంది సేకరించి, దహనం చేస్తారు.
- మృతదేహాన్ని భద్రపరచాల్సి వస్తే నాలుగు డిగ్రీల సెల్సియస్ కోల్డ్ చాంబర్‌లో మాత్రమే ఉంచుతారు.
- మార్చురీని, మహమ్మారి సోకిన వ్యక్తి ఉన్న క్వారంటైన్ గదిని ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేస్తారు.