Begin typing your search above and press return to search.
నవంబర్ 2 నుండి స్కూల్స్ ఓపెన్ .. మధ్యాహ్న భోజన పధకంలో కీలక మార్పులు !
By: Tupaki Desk | 27 Oct 2020 10:50 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ జోరు కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కూడా భారీగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే , గతంతో పోల్చితే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ లాక్ డౌన్ సమయంలోనే స్కూల్స్ మూసేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు స్కూల్స్ ఓపెన్ చేయలేదు. లాక్ డౌన్ నుండి అన్నింటికి మినహాయింపు ఇచ్చినప్పటికీ పిల్లలు పెద్ద ఎత్తున గుమ్ముగూడె అవకాశం ఉండటంతో స్కూల్స్ తెరవలేదు. ఇక ఏపీ ప్రభుత్వం పలుమార్లు స్కూల్స్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోని , కరోనా విజృంభణ తో మళ్లీ వెనక్కి తగ్గింది.
ఇక ఈ మద్యే నవంబర్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు దృష్ట్యా మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసే సమయంలో వాచ్, రింగులు, గాజులు, బంగారం ధరించకూడదని, అలాగే గోళ్ల రంగులు వేసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే ప్రతీ రోజూ కూరగాయలను ఉప్పు, పసుపుతో శుభ్రం చేయాలని సూచించింది. అటు భోజన సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. అలాగే , మరోవైపు స్కూళ్లకు చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా కూడా టీచర్లు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చునని , కరోనా నిర్దారణ పరీక్షల పలితాన్ని వాటి రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించాలని తెలిపింది.