Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్.. కేంద్రం భారీ స్టెప్
By: Tupaki Desk | 18 Aug 2020 5:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే వారి దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలకు గాను ఏకంగా 100 బిలియన్ డాలర్లు కేటాయించి ఫార్మా, పరిశోధన రంగాలతో వ్యాక్సిన్ కోసం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ కూడా అడుగులు వేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం తొలి అడుగు వేసింది. మూడురోజుల్లోగా రోడ్ మ్యాప్ ఇవ్వాలని.. ఐదు దేశీయ ఫార్మా కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. సోమవారం వ్యాక్సిన్ పై నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారీ ఎత్తున కరోనా వ్యాక్సిన్ ని తయారు చేసేందుకు కావాల్సిన సమయం, ధర వివరాలను తెలుపాలంటూ కేంద్రం ఐదు ఫార్మా కంపెనీలను కోరింది.
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ దశలో ఐదు కంపెనీలున్నాయి. అందులో సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటిక్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెన్నోవాలను గురువారంలోగా నివేదిక ఇవ్వాలని కేంద్రం సూచించింది.
క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కేంద్రం తొలి అడుగు వేసింది.