Begin typing your search above and press return to search.

రేపటి లోగా తేల్చండి.. లేదంటే..? ప్రభుత్వాని కి ఉద్యోగుల అల్టీమేటం

By:  Tupaki Desk   |   9 Nov 2021 11:37 AM GMT
రేపటి లోగా తేల్చండి.. లేదంటే..? ప్రభుత్వాని కి ఉద్యోగుల అల్టీమేటం
X
ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కొనసాగుతున్న వార్ సోమవారం బట్ట బయలైంది. ఇన్నాళ్లు గా జగన్ ప్రభుత్వం ఉద్యోగుల హామీలు నెర వేరుస్తామంటూ చెబుతూ వస్తుండడం తో ఓపిక పట్టారు. ముఖ్యం గా పీఆర్సీ విషయం లో ముందుకు వెళ్తున్నామని ప్రచారం చేయడం తో ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే తాజాగా పీఆర్సీ విషయం లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్ఫష్టం కావడం తో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. రేపటి లోగా పీఆర్సీకి సంబంధించిన నివేదిక ఇవ్వాలని, లేక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. దీంతో ఇన్నాళ్లుగా అణగ దొక్కుకుంటున్న వారి లోని అసహనం ఒక్క సారిగా బట్ట బయలైందని అంటున్నారు.

వైసీపీ అధినేత జగన్ అధికారం లోకి రాక ముందు ఊరూరా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ సమయం లో ప్రజా సమస్యలను తెలుసుకొని అవి పరిష్కారం కావాలంటే తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ సమయం లో ప్రభుత్వ ఉద్యోగులను కూడా కలిశారు. తమకు పీఆర్సీ విషయం లో న్యాయం చేయాలని ఉద్యోగులు జగన్ కు విన్న వించారు. దీంతో తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే దీని పై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో ఉద్యోగులంతా ఒక్కటై జగన్ కే జై కొట్టారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అవుతున్నా పీఆర్సీ విషయం లో జగన్ ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అయితే కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం ఫైలు ముందుకు జరుగుతుందని ప్రచారం చేశారు. కానీ కొందరు ఉద్యోగులు తీరా ఆరా తీస్తే అదంతా వట్టి దేనని తెలుసుకున్నారు. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగి పోయింది. ఈ నేపథ్యం లో పీఆర్సీ విషయం లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సరైన సమయానికి అందడం లేదు. గతం లో ఎప్పుడూ 30వ తేదీనే తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని, ఇప్పుడు 10వ తేదీ దాటినా అకౌంట్లో జమ కావడం లేదని అంటున్నారు. ఇక పెన్షనర్ల జీతాలు కూడా అదే పరిస్థితి నెలకొంది. గత సంవత్సర కాలం గా ఒకటో తేదీన పడ్డది లేదని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల దసరా సందర్భం గా కూడా సరైన సమయానికి జీతాలు పడ లేదు. కనీసం పండగపూట నైనా వేయాలని కొందరు కోరారు.

అయితే ఆర్థిక మంత్రి బుగ్గన మాత్రం ఉద్యోగుల పై సెటైర్లు వేస్తున్నారని కొందరు అంటున్నారు. తమకు జీతాల్లేక ఇబ్బందులు పడుతుంటే రెండ్రోజులు ఆగలేరా..? అని వ్యాఖ్యలు చేయడం బాధించిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకా నోక దశలో ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రం అంత రాయం లేకుండా నిర్వహిస్తున్నామని అంటున్నారు. అయితే ఇలా చేసుకుంటూ పోతే సమస్య పరిస్కారం కాదని ఉద్యోగులు ఉద్యోగ సంఘాలను అడగడం తో ఏదో ఒకటి తేల్చేయాలని నిర్ణయించారు.

దీంతో బుధవారం వరకు పీఆర్సీ విషయం లో లెక్క తేల్చాలని పట్టుబడుతున్నారు. ఇప్పటి కిప్పుడు పీఆర్స ప్రకటించక పోయినా నివేదిక నైనా ఇవ్వాలని అమరావతి జేఏసీ చైరమన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తున్నారు. నివేదిక విషయం లోనూ ఎలాంటి వైఖరి తెలపక పోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ తీరు తో ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయలు పెండింగు లో ఉన్నాయని, వాటి విడుదల పై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే 2018 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలని అప్పటి నుంచి ఒక్కరోజు తక్కువైనా ఒప్పుకోమని అన్నారు. అయితే ఉద్యోగుల డెడ్ లైన్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.