Begin typing your search above and press return to search.
త్వరలో టోల్ ప్లాజాలుండవు.. నంబర్ ప్లేట్ ఆధారంగా వసూళ్లు
By: Tupaki Desk | 25 Aug 2022 2:30 AM GMTటోల్ ప్లాజాలు.. టోల్ వసూలు చేసే ఈ కేంద్రాల వద్ద ఇప్పటికీ వాహనాలు బారులు తీరి ఉంటాయి. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఇక టోల్ ప్లాజాలా వద్దనే గంటలు గంటలు వాహనాలు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. టోల్ ను ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వమే తాజాగా మరో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే టోల్ ప్లాజాలను కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి రెడీ అయ్యింది. అంటే ఒక టోల్ వసూళ్లు ఉండవేమో అని ఊపిరి పీల్చుకోవచ్చు.
టోల్ గేట్లు ఇక ఉండవు కానీ.. టోల్ వసూళ్లు మాత్రం ఉంటాయి. మరి టోల్ ప్లాజాలు తొలగిస్తే వసూళ్లు ఎలా చేస్తారు? అనే డౌట్ రావచ్చు. కానీ టెక్నాలజీ డెవలప్ మెంట్ లో భాగంగా ఏదైనా జరగొచ్చు. దాంట్లో భాగమే ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ ఇకపై అది కూడా ఉండదు.
నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ వసూళ్లు జరిగిపోబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఫాస్టాగ్ వచ్చాక టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గిపోయింది. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే.. వాహనదారులకు ఎంతో సమయం వృథా అవుతుంది. అదే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే ప్రణాళిక దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రణాళికలు వెల్లడించారు.
టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ చార్జీ ఎలా వసూలు చేస్తారనే డౌట్ మీకు రావచ్చు. నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగా వాహనదారుల బ్యాంకు అకౌంట్ నుంచి ఛార్జీని వసూలు చేస్తారు. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించామని తెలిపారు.
ఫాస్టాగ్ విధానంలో కార్లపై ఆర్ఎఫ్డీ ట్యాగ్ స్టిక్కర్ వేస్తున్నారు. నంబర్ ప్లేట్లను రీడ్ చేసే విధానంలో వీటి అవసరం ఉండదు. దీని గురించి నితిన్ గడ్కరీ మాట్లాడారు. ‘కంపెనీ ఫిట్ చేసిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రోడ్లపైకి రావాలని 2019లోనే నిబంధనలు పెట్టాం. గత నాలుగేళ్లలో రోడ్లపైకి వచ్చిన కార్లలో నంబర్ ప్లేట్లు డిఫెరెంట్ గా ఉంటున్నాయి. కార్లలో ఈ నంబర్ ప్లేట్లు లేకపోతే నిర్ణీత సమయంలోగా వాటిని అమర్చుకునే విధంగా నిబంధనలు తెస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.
ప్రస్తుతం టోల్ చార్జీల్లో 97 శాతం అంటే సుమారు రూ.40 వేల కోట్లు ఫాస్టాగ్ ల ద్వారా వసూలు అవుతున్నాయి. ఫాస్టాగ్ వచ్చాక రోడ్లపై వాహనాల రద్దీ బాగా తగ్గింది. ఇప్పుడు ఆటోమేటిక్ నంబర్ల ప్లేట్లతో వాహనాలకు ఆటంకాలు మరింత తగ్గుతాయి.