Begin typing your search above and press return to search.

నో పార్కింగ్ లో బండి పెడితే షాక్ త‌ప్ప‌దు

By:  Tupaki Desk   |   26 Dec 2016 7:30 PM GMT
నో పార్కింగ్ లో బండి పెడితే షాక్ త‌ప్ప‌దు
X
మ‌న‌దేశంలో ఒక పెద్ద జోక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. నో పార్కింగ్ అని బోర్డ్ ఉందంటే అక్క‌డ ఎంచ‌క్క వాహనం నిలుపుకోవ‌చ్చు అని భావిస్తుంటారు కొంద‌రు. అయితే ఇలాంటి ప‌రిస్థితికి చెక్ పడ‌నుంది. నో పార్కింగ్ కు ప్ర‌స్తుతం ఉన్న‌ రూ.200 జరిమానా భారీగా పెంచేయ‌డంతో పాటు ఇప్పుడు ఉన్న నిబంధ‌న‌ల‌ను మరింత కఠినం చేసే దిశ‌గా కేంద్రం ప్ర‌భుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఏకంగా నో పార్కింగ్‌పై ఎవ‌రైనా స్పందించే వెసులుబాటును క‌లిపిస్తోంది.

ప్ర‌స్తుతం అస్త‌వ్య‌స్థ్య పార్కింగ్ వ‌ల్ల రోడ్లపై అడ్డదిడ్డంగా వాహ‌నాలు నిలిచిపోతున్నాయ‌ని, దీంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంద‌ని కేంద్రం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇలా అసౌక‌ర్యం క‌లిగించే వారికి జరిమానాను ఐదు రెట్లు పెంచటానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న 200 రూపాయలను వెయ్యి రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకు వచ్చే విధంగా అధికారులు రూల్స్ మార్చుతున్నారు. నో పార్కింగ్ పేరుతో నిలిపిన వాహ‌నాల‌ను ట్రాఫిక్ పోలీసులు మాత్రమే గుర్తించి.. ఫైన్ వేయాల్సిన అవసరం లేదనే ఆప్షన్ తీసుకొస్తున్నారు. వాహనదారులు, పాదచారులు ఎవరైనా సరే నో పార్కింగ్ లోని వెహికల్ ను ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖకు పంపించవచ్చు. త‌ద్వ‌రా త‌గు చ‌ర్య‌లు తీసుకునే విధంగా కేంద్రం కొత్త నిబంధ‌న‌లు తీసుకువ‌స్తోంది. ఈ నిబంధన అమలులోకి వస్తే..నో పార్కింగ్ స్థలంలో బండి పెడితే కష్టమేనేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/