Begin typing your search above and press return to search.
కండోమ్ పై కంట్రోలా...!!
By: Tupaki Desk | 4 Oct 2015 7:21 AM GMTకండోమ్ ప్రకటనలపై కేంద్రం కంట్రోలింగుకు రెడీ అవుతోంది. ఇంటిల్లిపాదీ టీవీ చూస్తుండగా ఎప్పుడు పడితే అప్పుడు ఏ ప్రోగ్రాంలో పడితే ఆ ప్రోగ్రాంలో ఈ కండోమ్ యాడ్స్ వస్తుండడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. చాక్లెట్లు, బిస్కట్ల ప్రకటనలు వచ్చినట్లు అదేంటని.. కొనివ్వమని అడిగినట్లే పిల్లలు కండోమ్ యాడ్స్ వచ్చినప్పుడు కూడా అదేంటని అడుగుతుంటే తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారట. కాస్తగా వయసొచ్చిన పిల్లలు ఉన్నప్పుడూ సడెన్ గా ఈ యాడ్స్ వస్తుంటే తల్లిదండ్రులు - పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ ప్రకటనలను కొంత సమయానికే పరిమితం చేయాలని భావిస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే ఇవి ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇకపై పగటిపూట కండోమ్ ప్రకటనలు ప్రసరం చేయకుండా రాత్రి 11 నుంచి వేకువన 5 గంటల మధ్య మాత్రమే ప్రసారం చేసేలా నిబంధనలను రూపొందిస్తున్నారు.
కాగా ఇటీవల కాలంలో కండోమ్ ప్రకటలపై దేశవ్యాప్తంగా వివాదాలు రేగిన సంగతి తెలిసిందే. కేంద్రానికి విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. పలువురు రాజకీయ నేతలూ దీనిపై స్పందించారు. ప్రధానంగా సన్నీ లియోన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన శ్రుతిమించిందని... అలాంటివి నిషేధించకుంటే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతాయని స్టేట్ మెంట్లు ఇచ్చారు. కాగా ఈ ప్రకటలను పూర్తిగా నిషేధించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ అంత అవసరం లేదని... రాత్రి వేళలకే పరిమితం చేస్తే చాలని కేంద్రం అభిప్రాయపడింది. ఆ దిశగానే చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది.
అయితే... బర్త్ కంట్రోల్ మెథడ్స్ లో ది బెస్టు అనిపించుకునే కండోమ్ వాడకాన్ని ప్రోత్సహించాలని... కానీ, ఇలా కంట్రోల్ చేస్తే బర్త్ కంట్రోల్.. సుఖవ్యాధుల కంట్రోల్ ఎలా సాధ్యమని అనేవారూ ఉన్నారు.