Begin typing your search above and press return to search.
వామ్మో.. పీస్ టీవీ ఛానల్ అంత డేంజరా?
By: Tupaki Desk | 8 July 2016 4:38 AM GMTఅధ్యాత్మిక కార్యక్రమాలు.. మత ప్రవక్తల సందేశాల్ని.. వారి ప్రసంగాల్ని ప్రసారం చేసే పీస్ టీవీ ఛానల్ ను చాలామంది లైట్ తీసుకుంటారు కానీ.. ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రసారాలు ఎంత ప్రమాదకరమైనవన్న విషయం తాజాగా ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఎపిసోడ్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన దుర్మార్గపు మాటలతో.. అమాయకుల్ని రెచ్చగొట్టటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారా.. ఉగ్రవాదం వైపునకు ఆకర్షితులయ్యేలా మాట్లాడటం లాంటి దుర్మార్గాలన్నీ చేస్తున్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
ఇతడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావటమే కాదు.. చివరకు అఖిల భారత షియా పర్సనల్ లా బోర్డు సైతం ఇతడి వ్యవహారంపై స్పందించింది. ఇతడి ప్రసంగాల్ని.. పీస్ టీవీ చానల్ ను బ్యాన్ చేయాలంటూ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా యసూబ్ అబ్బాస్ డిమాండ్ చేశారు. జకీర్ నాయక్ బోధనలపై తక్షణమే బ్యాన్ విధించాలన్న ఆయన.. అతడి ప్రసంగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ జకీర్ నాయక్ చేస్తున్న ప్రకటనలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత సర్కార్ వెనువెంటనే పీస్ టీవీ ఛానల్ ప్రసారాల్ని.. నాయక్ బోధనల్ని బ్యాన్ చేయాలని షియా పర్సనల్ లా బోర్డు భారత ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో పీస్ టీవీకి సౌదీ అరేబియా.. ఇతర ముస్లిం దేశాల నుంచి అందుతున్న నిధులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ ను చేస్తున్నారు. ఏమైనా పీస్ టీవీ.. జకీర్ నాయక్ పైనా మోడీ సర్కారు కన్నెర్ర చేయాల్సిన టైం వచ్చేసిందని చెప్పొచ్చు. మరి.. మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.