Begin typing your search above and press return to search.

కరోనా మందుకు ప్రభుత్వం సహకరించడం లేదు: ఆనందయ్య

By:  Tupaki Desk   |   24 Jun 2021 11:30 AM GMT
కరోనా మందుకు ప్రభుత్వం సహకరించడం లేదు: ఆనందయ్య
X
ఔషధ మూలికల కొరత, కనీస సౌకర్యాలు లేక కరోనా నివారణ ఆయుర్వేద మందు పంపిణీ తయారు చేయలేకపోతున్నట్టు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలిసిన ఆనందయ్య వాపోయారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను ఉచితంగా ఏపీలోని కరోనా రోగులకు మందును పంపిణీ చేస్తానని ఆనందయ్య తెలిపారు. దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో అందరికీ ఆయుర్వేద కరోనా మందు అందిస్తున్నానన్నారు.

ప్రతి పార్టీ కోరిన వెంటనే మొదట్లోనే తన మందును ఇచ్చానని.. పార్టీలకు అతీతంగానే తాను కరోనా నివారణ మందును పంపిణీ చేస్తున్నాను అని ఆనందయ్య తెలిపారు. ప్రజలకు ఏవిధంగా మందు పంపిణీ చేయాలనే దానిపైనే తమ దృష్టి ఉందన్నారు. అవసరమైన వారు వచ్చి తీసుకెళుతున్నారన్నారు.

సొంత నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండని.. మీరు సలహాలు సూచనలు ఇస్తే మందు పంపినీ చేస్తానని ఆనందయ్య మీడియా మిత్రులకు సూచించారు. నెల్లూరు జిల్లాకు మొదటి ప్రాధాన్యమని.. డేటా ఇస్తే ముందుగా వారికే ఇస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో నా మందు ఇస్తానని ఆనందయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తానన్నారు.

ఆనందయ్య ఆయుర్వేద మందు బట్టి దుకాణాల్లో అమ్ముతున్నారంటే అది ఏపీ ప్రభుత్వం లోపం అని.. అది తన లోపం కాదని ఆనందయ్య తెలిపారు. ఈరోజుకు తాను ఉచితంగానే మందు పంపిణీ చేస్తున్నానని ఆనందయ్య తెలిపారు. తన మందును బయట అమ్మవారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందయ్య డిమాండ్ చేశారు.

ఏపీ ప్రభుత్వం తన మందుకు అనుమతి ఇచ్చింది.. సహాయం చేసిందని.. కానీ ఆ మందును ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలన్నది గైడెన్స్ లేదని..తాను లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని ఆనందయ్య అన్నారు. ఏ పార్టీ వాళ్లు అడిగినా సేవా దృక్పథంతో వచ్చిన వారికి ఈ మందు ఇస్తున్నామని ఆనందయ్య తెలిపారు.

ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయమని కోరామని.. దానికి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులకు తాము ఇస్తున్నామన్నారు.