Begin typing your search above and press return to search.
ఎన్నికల తోఫా; బీహార్ కు మరో వరం ఇచ్చేశారు
By: Tupaki Desk | 20 Aug 2015 5:04 AM GMTపీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన ఏపీ విషయాన్ని అస్సలు పట్టించుకోని మోడీ సర్కారు.. బీహార్ విషయంలో మాత్రం పెద్ద మనసుతో స్పందిస్తోంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో యుద్ధప్రాతిపదికగా వ్యవహరిస్తోంది. యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలాఖరులో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆ లోపు తీసుకోవాల్సిన చర్యల్ని తీసేసుకుంటోంది.
మంగళవారం బీహార్ కు రూ.1.25లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించటం.. గతంలో ఇచ్చిన రూ.40వేల కోట్ల హామీల్ని తీరుస్తామని చెప్పటంతో పాటు.. బీహార్ రాష్ట్ర రాజధానితో సహా పలు జిల్లాల్ని పెద్ద ఎత్తున వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా బుధవారం మరో నిర్ణయాన్ని కేంద్రం తీసేసుకుంది.
బీహార్ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ఆదాయపన్నులో 30 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. బీహార్ రాజధాని పాట్నాతో సహా మొత్తం 21 జిల్లాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య వరకు పరిశ్రమలు నెలకొల్పిన వారికి ఈ పన్ను రాయితీ సౌకర్యం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న రాయితీలకు ఈ మొత్తం అదనం కావటం గమనార్హం. ఎన్నికలు ముంగిట్లో వచ్చి పడుతున్న వేళ.. బీహార్ కు ఎడాపెడా హామీలు ఇచ్చేస్తున్న కేంద్రం.. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో మాత్రం ఇంత చురుగ్గా వ్యవహరించకపోవటం గమనార్హం.