Begin typing your search above and press return to search.
వైఎస్ కొండారెడ్డి.. జిల్లా బహిష్కరణ.. సర్కారు సంచలన నిర్ణయం!!
By: Tupaki Desk | 12 May 2022 3:11 AM GMTవైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ నేత వైఎస్ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. ఇది ఒకరకంగా సంచలన నిర్ణమే అవుతుంది. ఈ క్రమంలో కొండారెడ్డిపై బహిష్కరణ వేటు వేసేలా వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో అలజడి రేగింది. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నా.. ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీలోని కొండారెడ్డి సానుభూతి పరులు ఉలిక్కి పడ్డారు.
ఎస్పీ ఏమన్నాడంటే..కొండారెడ్డి బహిష్కరణ వేటుపై వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణకు ప్రతిపాద నలను కలెక్టర్‌కు పంపినట్టు కడప ఎస్పీ అన్బురాజన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు బహిష్కరణ చర్య తీసుకున్నట్టు ఆయన తెలిపారు. వైఎస్ కొండారెడ్డి పై ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఉద్యోగులను బెదిరించడంతో పాటు పలు కేసులున్నాయని తెలిపారు. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బెదిరిస్తే 100, 14400, 9440796900కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కొండారెడ్డి ఎవరు.. ఏం జరిగింది?పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి వైసీపీ ఇన్చార్జిగా వైఎస్ కొండారెడ్డి కొనసాగుతున్నారు. ఈ మండల పరిధిలో ఏ పని చేయాలన్నా ఈయన ఆశీస్సులు తీసుకోవాల్సిందే. అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అని సమాచారం. లేదంటే ఆ పనిని చేయనివ్వరని అంటున్నారు. అధికారులు సైతం ఆయనకు ఎదురు చెప్పరని సమాచారం. ప్రస్తుతం మండలంలో గ్రావెల్ రోడ్లు, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పనులన్నీ ఈయన అనుయాయులకే దక్కాయి. ఒక ఎత్తిపోతల పథకం, ఫోర్ లేన్ రోడ్డు పనులూ సాగుతున్నాయి.
కర్నూలు జిల్లాలోని చాగలమర్రి నుంచి వైఎస్సార్ జిల్లా దువ్వూరు, ఎర్రగుంట్ల, వీరపునాయునిపల్లె, వేంపల్లి, చక్రాయపేట మీదుగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వరకు రూ.350 కోట్లతో 143 కి.మీ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సంస్థ పనులు చేస్తోంది. వీరిని పర్సంటేజీ రూ.5 కోట్లు ఇవ్వాలని కొండారెడ్డి బెదిరించారని సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీకి చెప్పడం కాదని.. స్థానికంగా తను చెప్పినట్టు వినాల్సిందేనని ఆయన హుకుం జారీ చేశారని అంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ పెద్దల వద్దకు, సీఎం దృష్టికి పోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, బుధవారం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంతలోనే జిల్లా నుంచి ఏకంగా బహిష్కరించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.
గతంలోనూ..చక్రాయపేట మండలం సిద్దారెడ్డిగారిపల్లె సమీపంలో కాలేటివాగుపై ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనికి గ్రావెల్ అవసరం. ప్రస్తుతం కాంట్రాక్టర్లు గ్రావెల్ తోలి ఎత్తిపోతల పథకం కట్టను చదును చేస్తున్నారు. అయితే దీనికి అవసరమైన గ్రావెల్‌ను ఉచితంగా తోలుకునేందుకు వీలుగా వీరు ఫిబ్రవరి నెలలో కాలేటివాగు అలుగును తెంపేశారు. అయినప్పటికీ కాలేటివాగు చెరువులో నీళ్లు తగ్గలేదు. వారం క్రితం కాలేటివాగుకు గండికొట్టారు. దీంతో చెరువులో నీళ్లన్నీ వెళ్లిపోయాయి.
ప్రస్తుతం ఈ చెరువు కింద 300 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. ఈ రైతులంతా లబోదిబోమంటున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ నేతలు సైతం అక్కడికి వెళ్లి గండికొట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంత జరిగినా వెంటనే అధికారులు అక్కడకు వెళ్లే సాహసం చేయలేదు. కట్టకు గండికొట్టిన మూడు రోజులకు అధికారులు వెళ్లి ఇసుక బస్తాలు వేసి వచ్చారు. దీని వెనక మండల నేత కొండా రెడ్డి ఉన్నారని ప్రచారం జరిగింది.