Begin typing your search above and press return to search.
రిలయన్స్ కు మోడీ సర్కారు ఫైన్ ఎంతంటే..?
By: Tupaki Desk | 18 Aug 2016 1:08 PM GMTప్రఖ్యాత కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది మోడీ సర్కారు. తన కనుసైగతో కేంద్రమంత్రుల స్థానాల్ని సైతం మార్చేసే సత్తా ఉందని చెప్పే ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు కేంద్రం భారీ షాకిచ్చింది. లక్ష్యం చేరుకోకుండా విఫలమైన కేజీ బేసిన్ లోని గ్యాస్ వెలికితీత విషయంలో రిలయన్స్ సంస్థ తీరును తప్పు పడుతూ ఆ సంస్థపైనా.. దాని భాగస్వామ్య సంస్థల పైనా భారీ ఫైన్ విధించింది.
కేజీ బేసిన్ లోని డీ 6 క్షేత్రాల నుంచి ముందస్తుగా ఒప్పుకున్న లక్ష్యం కంటే తక్కువగా సహజవాయువును ఉత్పత్తి చేయటం రిలయన్స్ కు కొత్తేం కాదు. గతంలోనూ ఈ సంస్థ మీద ఇదే తరహాలో పలు ఫిర్యాదులు వచ్చినట్లుగా చెబుతారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తాజాగా రిలయన్స్ చేసిన తప్పుపై కేంద్రం కన్నెర్ర చేసి.. రిలయన్స్.. దాని భాగస్వాములపై 380 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించింది. దీన్ని రూపాయిల్లో లెక్కిస్తే దాదాపు రూ.2500 కోట్లుగా చెప్పొచ్చు.
2010 ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రిలయన్స్ వెలికితీయాల్సినంత సహజవాయువును వెలికితీయకుండా ఉంది. లక్ష్యం కంటే తక్కువగా ఉత్పత్తి చేసినందుకు విధించిన జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలుస్తోంది. తాజాగా మోడీ సర్కారు విధించిన ఫైన్ పై రిలయన్స్ .. దాని భాగస్వామ్య పక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.