Begin typing your search above and press return to search.
నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసిందంటే?
By: Tupaki Desk | 9 Aug 2021 10:32 AM GMTనీరజ్ చోప్రా ... ప్రస్తుతం దేశంలో ఈ పేరు మారుమోగిపోతుంది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా పసిడి పతకంతో భారత్ కు అద్భుతమైన తీపి జ్ఞాపకాన్ని అందించాడు. 130 కోట్ల భారతీయుల 125 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి 13ఏళ్ల భారత స్వర్ణ నిరీక్షణకు తెరదించుతూ విశ్వ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో 23 ఏళ్ల నీరజ్ ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాష్ట్రపతి, ప్రధాని నుంచి మొదలుకొని సామాన్యుని వరకు అందరూ నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించారు. అ
యితే నీరజ్ విజయం వెనుక భారత ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. అతని ప్రతిభ గుర్తించిన ప్రభుత్వం నీరజ్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం.. టోక్యో ఒలింపిక్స్ కు ముందు నీరజ్ చోప్రా 450 రోజుల పాటు జావెలిన్ త్రో కోసం విదేశాల్లో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ కోసం కేంద్ర సర్కార్ 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చోప్రా ప్రస్తుత ఒలింపిక్స్ కోసం 26 పోటీలలో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికా, పోలాండ్, టర్కీ, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్ స్వీడన్ వంటి దేశాల్లో విదేశీ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు.
2012లో అండర్ 16 నేషనల్ చాంపియన్ గా నిలిచిన నీరజ్.. 2015లో మన హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. 2016లో పోలాండ్ వేదికగా జరిగిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దడడానికి తనలో ఎంత ప్రతిభ ఉందో, దానికి రెట్టించిన కష్టం కూడా ఉంది. నీరజ్ ప్రతిభ, కష్టాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది.
తొలుత 2017లో నీరజ్ చోప్రా కోచ్‌గా జావెలిన్ త్రో లెజెండ్ ఉవే హోన్ బాధ్యతలు స్వీకరించగా.. 2019లో చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్గా డా. క్లాస్ బార్టోనియెడ్జ్ ఎంపికయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1.22కోట్లు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్లకు రూ. 4,35,000 ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు నీరజ్ యూరప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్‌లో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ .19.22 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా దేశానికి స్వర్ణపతకం అందించి వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రాకు ముందు అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో 2008 బీజివగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 7 పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం కాగా, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో భారత్ 48వ స్థానంలో నిలిచింది.