Begin typing your search above and press return to search.
బోర్డులపై ప్రభుత్వం కోర్టులో కేసు వేస్తోందా ?
By: Tupaki Desk | 1 Aug 2021 10:34 AM GMTనీటి యాజమాన్య బోర్డుల ఆజమాయిషీలపై సుప్రింకోర్టులో ఏపి ప్రభుత్వం కేసు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణా-ఏపి మధ్య నదీజలాల షేరింగ్ విషయంతోపాటు నీటి వినియోగం విషయంలో గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణాతో సమస్యలను పడలేక రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణను తీసేసుకోవాలంటు కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.
అయితే జగన్ లేఖలో ప్రస్తావించిన అంశాలతో పాటు మొత్తం ప్రాజెక్టులన్నింటనీ తన పరిధిలోకి తీసుకుంటు కేంద్రప్రభుత్వం గెజెట్ జారీచేసింది. అంటే ప్రాజెక్టుల వివాదాల పరిష్కారినికి ఉన్న కృష్ణ రివర్ బోర్డు మేనేజ్మెంట్ (కేఆర్ఎంబి), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల(జీఆర్ఎంబి)ను కూడా కేంద్రం తన పరిధిలోకి తీసేసుకుంది. సమస్యలు తలెత్తిన ప్రాజెక్టుల గురించి జగన్ తన లేఖలో ప్రస్తావిస్తే కేంద్రం మొత్తం ప్రాజెక్టులను తీసేసుకోవటంపై నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
మొత్తం ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసేసుకుంటే భవిష్యత్తులో ఏపికి జరగబోయే నష్టాల గురించి నిపుణులు కొందరు జగన్ కు లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలపై చాలామంది ఏకీభవిస్తున్నారు. దాంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కేంద్రం పరిధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మాత్రమే కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుంటే చాలని జగన్ కేంద్రానికి లేఖ రాయబోతున్నారు. మిగిలిన ప్రాజెక్టులను గతంలో లాగే ఏపి ప్రభుత్వం పరిధిలోని ఉంచాలని డిమాండ్ చేయబోతున్నారు.
ఒకవేళ కేంద్రం గనుక తన లేఖకు సానుకూలంగా స్పందిచకపోతే ఇదే విషయమై సుప్రింకోర్టులో కేసు వేయాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసిందట. ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి వెళిపోతే సాగు, తాగు నీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా కేంద్రాన్ని బతిమలాడుకోవాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అసలు జల వననులన్నవి రాష్ట్రాల పరిధిలోని అంశమే తప్ప కేంద్రానికి సంబంధం లేదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. మరి తాజా పరిణామాలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.