Begin typing your search above and press return to search.
పార్లమెంటులో 'తలాక్' బిల్లు..యూపీలో తలాక్!
By: Tupaki Desk | 28 Dec 2017 11:02 AM GMTకొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ పై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమకు ఇష్టమొచ్చిన రీతిలో కొంతమంది పురుషులు త్రిపుల్ తలాక్ ను దుర్వినియోగం చేయడంతో ముస్లిం మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పురుషులు యధేచ్ఛగా ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత ఆ మహిళలు దిక్కుతోచని స్థితిలోకి వెళుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశ పెట్టాలని కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను పార్లమెంటులో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన లోక్ సభలో తెలిపారు. ప్రతిపక్షంతో పాటు మిగిలిన పార్టీల సభ్యులందరూ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలపాలని కోరారు. ఆయనతోపాటు ప్రధాని మోడీ కూడా సభలో ఏకాభిప్రాయం కోసం విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కొందరు ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ బిల్లుపై పార్లమెంటు సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఈ బిల్లు ఉందని - చట్టపరంగా కూడా ఈ బిల్లులో పలు లొసుగులున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రస్తతం దేశంలో ట్రిపుల్ తలాక్ చెప్పడం అక్రమమని - మళ్లీ ప్రత్యేకించి బిల్లును ప్రవేశపెట్టనవసరం లేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును గృహహింసను నిర్మూలించేందుకు ఉద్దేశించిన చట్టంలో చేర్చాలని ఆయన కోరారు. ఈ బిల్లు ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త జైలుకు వెళతాడని - అటువంటి సమయంలో సదరు మహిళకు న్యాయం జరగదన్నారు. ఒవైసీతో పాటు బిజూ జనతాదళ్ సభ్యులు బీజేపీ ప్రతిపాదిత బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులో చాలా లోపాలున్నాయని భర్తృహరి మహతాబ్ అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలను రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించేందుకే ఈ బిల్లును రూపొందించామని - ఈ బిల్లుకు మతాచారాలకు సంబంధం లేదన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా మహిళలు అన్యాయాలకు గురవుతున్నారని ఆయన అన్నారు.
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించిన సభ్యుల బృందం ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’కు రూపకల్పన చేసింది. ఇప్పటివరకు ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత భార్యతో విడాకులు తీసుకునే అవకాశం భర్తకు ఉంది. దీనిని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విధానం వల్ల మహిళలు బాధితులై ఇబ్బందులు పడుతున్నారని ఆ విధానాన్ని అక్రమంగా పరిగణిస్తూ ఈ బిల్లును రూపొందించారు. ఒక వేళ నేడు ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా మారితే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష - జరిమానా పడుతుంది. నేరుగా - లిఖితపూర్వకంగా - లేదా ఎలక్ట్రానిక్ విధానంలో(వాట్సాప్ - వీడియో కాలింగ్ తదితరాలు) ముమ్మార్ తలాక్ చెప్పడాన్ని నేరంగాను - చెల్లనిదిగాను పరిగణిస్తూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి - జీవన భృతి కోరడానికి వీలుంటుంది. మైనర్ పిల్లల సంరక్షణపైనా న్యాయమూర్తి ద్వారా ఉత్తర్వులు పొందవచ్చు. అయితే, ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయని - ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపి బిల్లును ప్రతిపాదించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు.....ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరింది. ఈ బిల్లును రూపొందించడంలో సరైన పద్ధతిని అవలంబించలేదని ఆరోపించింది.
ఓవైపు లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టి గంటలైనా గడవక ముందే....ఉత్తరప్రదేశ్ లో ఓ త్రిపుల్ తలాక్ ఘటన వెలుగులోకి రావడం సంచలనం రేపింది. తన భార్య ఆలస్యంగా నిద్ర లేస్తుందన్న చిన్న కారణంతో ఆ భర్త మూర్ఖంగా ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. యూపీకి చెందిన ఖాసీం అనే ట్రక్కు డ్రైవర్ కు....గుల్ అఫ్షాన్ అనే యువతితో నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. పెళ్లేప రెండో రోజు నుంచే ఆమెను అతడు కొట్టడమే కాకుండా....తాజాగా, ఆమె ఆలస్యంగా నిద్ర లేస్తుందని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో ఈ విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్ సభలో ప్రస్తావించారు. ఆలస్యంగా నిద్ర లేచినందుకు కూడా విడాకులు ఇస్తారా... అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ రోజు ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందితే అతడికి జైలు శిక్ష పడేదని తెలిపారు.