Begin typing your search above and press return to search.
ఎన్ఆర్ఐలు విదేశాలకు పంపే డబ్బులపై ప్రభుత్వం పన్ను?
By: Tupaki Desk | 17 Nov 2022 11:30 AM GMTఎన్ఆర్ఐలకు సైతం కేంద్ర ప్రభుత్వం షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. వారి ఆదాయ వ్యయాలపై పన్నులు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారతదేశం నుండి స్వీకరించబడిన విదేశీ చెల్లింపుల వివరాలను ఎన్‌ఆర్‌ఐలు పంచుకోవడాన్ని ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేయవచ్చు.
తదుపరి ఆర్థిక సంవత్సరంలో దానిని పన్ను పరిధిలోకి వచ్చే , పన్ను పరిధిలోకి రాని ఆదాయంగా విభజించవచ్చని సమాచారం.
దీంతో పాటు ఎన్.ఆర్ఐలు తమ భారతీయ వ్యాపార సంబంధాలను బహిర్గతం చేయవలసిందిగా కూడా ఆదేశించబడవచ్చు. అటువంటి వ్యాపారాలు ఎక్కడ పెట్టారు? ఎవరితో కలిసి పెట్టారు? ఆచూకీ గురించి కూడా విశదీకరించవలసిందిగా కోరవచ్చు, ఈ మేరకు ఎన్ఆర్ఐల ఆదాయంపై నిఘా పెట్టేందుకు కేంద్రం ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మునుపటి యజమాని నుండి మూలధన ఆస్తులను పొందిన వ్యక్తి , మూలధన లాభాల నుండి మినహాయింపు పొందిన వ్యక్తి విషయంలో కూడా ఆదాయపు పన్ను శాఖ వివరాలను కోరవచ్చని నివేదకలు చెబుతున్నాయి..
మూలధన ఆస్తిని పొందిన వ్యక్తి మూలధన ఆస్తుల విక్రయంపై మునుపటి యజమాని వివరాలను నివేదించమని కోరవచ్చు. దీంతో ఎన్ఆర్ఐలు అమెరికాలో సంపాదించి ఇక్కడ ఆస్తులు కొనడం.. మార్చుకోవడం.. అమెరికాలో కొనేందుకు ప్రయత్నించే అన్నింటిపై కూడా కేంద్రం పన్నులు విధించేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ పరిణామం ఎన్ఆర్ఐలకు షాకిచ్చేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.