Begin typing your search above and press return to search.

వాట్సాప్ ను మోడీ స‌ర్కారు ఏం అడిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:00 AM GMT
వాట్సాప్ ను మోడీ స‌ర్కారు ఏం అడిగిందో తెలుసా?
X
దేశ ప్ర‌జ‌ల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న సోష‌ల్ మీడియాను దాటేసిన స‌త్తా వాట్సాప్ ది. చ‌దువున్నా.. లేకున్నా.. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో చెల‌రేగిపోతున్న వైనం ఇప్పుడు అంత‌కంత‌కూ పెరుగుతోంది. తొలుత స‌మాచార సేక‌ర‌ణ‌కు.. ఇత‌ర అవ‌స‌రాల‌కు వాట్సాప్ ను వినియోగించారు.

తాజాగా అది కాస్తా మ‌రో అడుగు ముందుకు ప‌డి.. వదంతుల‌ను.. త‌ప్పుడు స‌మాచారాన్ని వాట్సాప్ ద్వారా వ్యాపింప చేస్తున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియ‌ల్స్ తో కేంద్ర ఐటీ శాఖామంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ భేటీ అయ్యారు. భార‌త్ లో నాలుగైదు రోజుల పాటు ప‌ర్య‌టించాల‌ని భావిస్తున్న వాట్సాప్ సీఈవోతో కేంద్రమంత్రి స‌మావేశం కావ‌టం.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాలు వాట్సాప్ సీఈవో దృష్టికి తీసుకొచ్చారు.

మూక‌హ‌త్య‌లు.. అశ్లీల దృశ్యాలతో పాటు.. నేరాన్ని ప్రేరేపించేలా ఉన్న వాటి కార‌ణంగా దేశంలో తీవ్ర ప‌రిణామాలు చోటు చేసుకున్న‌ట్లుగా వాట్సాప్ సీఈవో దృష్టికి కేంద్ర‌మంత్రి తీసుకెళ్లారు. ఇలాంటి వాటికి ప‌రిష్కారాన్ని చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్ లో ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు ఒక అధికారిని నియ‌మించాలన్న సూచ‌న‌ను చేశారు.ఇదిలా ఉంటే.. కేంద్ర‌మంత్రి చేసిన ప్ర‌పోజ‌ల్ పై వాట్సాప్ సీఈవో సానుకూలంగా స్పందించారు. కేంద్ర‌మంత్రి త‌న దృష్టికి తీసుకొచ్చిన అంశాల‌పై త‌మ సంస్థ ప‌ని చేస్తుంద‌న్న హామీని ఇచ్చారు. మ‌రి.. రానున్న రోజుల్లో వాట్సాప్ ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.