Begin typing your search above and press return to search.
తాజ్ మహల్ పర్యాటకులపై ఆంక్షలు?
By: Tupaki Desk | 3 Jan 2018 5:38 PM GMTతాజ్ మహల్.....ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.....యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడం..... `న్యూ సెవెన్ వండర్స్` లో చోటు దక్కించుకున్న భారతీయ కళాఖండం....మొఘల్ శిల్ప, వాస్తు, నిర్మాణ కళకు నిలువెత్తు తార్కాణం.....కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క .....అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతంగా వర్ణించిన దృశ్యకావ్యం.....కాలం చెక్కిట జాబిలి చుక్క ప్యార్ మహల్..... తీరని ప్రేమకు స్మారక లేఖ తాజ్ మహల్ అంటూ సినీకవులు వర్ణించిన ప్రేమ మహల్.....ప్రేమికుల గుండెల్లో `గూడు` కట్టుకున్నజ్ఞాపకం.....ఇంతటి ప్రాముఖ్యం ఉంది గనుకే ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. తాజ్ అందాలను గంటల తరబడి తనివి తీరా ఆస్వాదించి పులకరించిపోతుంటారు. ఆ పాలరాతి శిల్పాన్ని చూస్తూ తమను తాము మైమరచిపోయి సమయాన్ని కూడా మరచిపోతుంటారు. తాజాగా, తాజ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు భారత పురావస్తు శాఖ షాక్ ఇవ్వనుంది. ఇకపై తాజ్ అందాలను వీక్షించే సమయాలపై ఆంక్షలను విధించే యోచనలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ(ఏఎస్ ఐ) అధికారులు, ఆగ్రా జిల్లా యంత్రాంగం - సీఐఎస్ ఎఫ్ భద్రతా సిబ్బంది - తదితరులతో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవీంద్ర సింగ్ బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయం గురించి చర్చించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఏఎస్ ఐ అధికారి ఒకరు తెలిపారు.
తాజ్ మహల్ వంటి పురాతన కట్టడాన్ని కాపాడేందుకు రోజువారీ పర్యాటకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలని యెచిస్తున్నారని తెలుస్తోంది. ఆన్ లైన్ - ఆఫ్ లైన్ కలిపి రోజుకు 40వేల టిక్కెట్లు మాత్రమే అమ్మాలని, అలాగే తాజ్ ను సందర్శించేందుకు ప్రతి టిక్కెటుపై మూడు గంటల కాల పరిమితి విధించాలని భావిస్తున్నారు. దాంతోపాటు, 15 సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా ప్రవేశం కల్పించేయందుకు`జీరో వ్యాల్యూ టికెట్స్` ప్రవేశపెట్టేందుకు అధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు తాజ్ పర్యాటకులపై ఎటువంటి ఆంక్షలు లేవన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి ఏటా తాజ్ ను 70-80 లక్షల మంది సందర్శిస్తుంటారు. సెలవు రోజులు - వేసవి సెలవుల్లో రోజుకు 60వేల నుంచి 70వేల మంది తాజ్ ను సందర్శిస్తున్నారు. దీనికి తోడు - ప్రతి ఏటా పర్యటకుల సంఖ్య 10 నుంచి 15శాతం పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజూ తాజ్ మహల్ ను ఎంతమంది సందర్శించవచ్చు - ఆ కట్టడం పై ఎంతమంది తిరగవచ్చు అన్న విషయాలను అంచనా వేసేందుకు 2012లో నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(నీరి)ను ఏఎస్ ఐ నియమించింది. ఆ కమిటీ సమర్పించిన తుది నివేదిక ప్రకారమే తాజ్ పర్యాటకుల సంఖ్యను పరిమితం చేయడం - వీక్షణ సమయంపై ఆంక్షలు విధించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ఆ అధికారి తెలిపారు. అయితే, ఈ విషయంసై కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ ఐ ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.