Begin typing your search above and press return to search.
ఏపీలో రంజుగా పీఆర్సీ ఫైట్.. ఉద్యోగుల్లో జీతాల టెన్షన్
By: Tupaki Desk | 27 Jan 2022 5:30 AM GMTఏపీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల ఫైట్ కొనసాగుతోంది. పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించలేదు. మళ్లీ ఇవాళ మరోసారి చర్చలు జరిపే చాన్స్ ఉంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది.
ఏపీలో పీఆర్సీ అంశానికి సంబంధించి మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటి అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రయోజనాలను మంత్రుల కమిటీ వివరించింది. జీతాలు తగ్గాయన్న అపోహలను తొలగించే ప్యత్నం చేస్తోంది ప్రభుత్వం.
27వ తేదీన నేడు మరోసారి చర్చలకు పిలిచింది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని సజ్జల స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ కు సంబంధించి ఎలాంటి మార్పు ఉండబోదని.. ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు.
ఓవైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ. మరోవైపు డిమాండ్ల సాధన కోసం ఏపీలో ఉద్యోగులు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు ఉద్యోగులు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ ఆహ్వానించింది. అయితే పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకూ చర్చలకు వెళ్లమని స్టీరింగ్ కమిటీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జిల్లాలో జరిగే రిలే దీక్షలకు హాజరు కావాలని జేఏసీ నేతలు కోరారు.
ఇక పీఆర్సీ ఉద్యమంలో తగ్గేదేలే అని ఉద్యోగులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ ఎన్జీవోస్ హోం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్ లో రిలే నిరాహార దీక్షల సన్నాహక సమావేశాన్ని పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.
విజయవాడ ధర్నాచౌక్ లో రిలేదీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జేఏసీ నేతలు చెప్పారు.