Begin typing your search above and press return to search.
‘చిల్లర’ కష్టాలపై మోడీ మరో సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 14 Nov 2016 5:07 PM GMTసీన్లో ఉండాలే కానీ ఇష్యూ ఏదైనా సితక్కొట్టేసే మొనగాడితనం మోడీ సొంతం. పెద్దనోట్ల రద్దు లాంటి సాహసోపేతమైన.. సంచలన నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే విదేశీ పర్యటనకు వెళ్లటంతో కాస్త లెక్కల్లో తేడా వచ్చింది. అదే కానీ.. ఆ నిమిషం నుంచి మోడీ కానీ మానిటరింగ్ మొదలెట్టినట్లైతే.. వ్యవహారం మరోలా ఉండేదన్న వాదన వినిపిస్తోంది.
విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక.. వేగుల నుంచి అందిన సమాచారంతో అలెర్ట్ అయిన మోడీ భావోద్వేగ ప్రసంగంతో పాటు.. పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో సామాన్యుడు బాధితుడిగా మారకూడదన్న తీరులో వరుస నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఆదివారం అర్థరాత్రి వేళ తర్వాత కొందరు మంత్రులతో.. కీలక అధికారులతో తన ఇంట్లో సమావేశమైన ఆయన.. ‘చిల్లర’ నోట్ల కష్టాలకు చెక్ చెప్పేలా పలు చర్యలు తీసుకోవటంతో పాటు.. ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు వెలువడేలా చేశారు.
అలాంటి నిర్ణయాలు ఈ రోజు (సోమవారం) ఉదయం నుంచి వెలువడుతూనే ఉన్నాయి. అలాంటిదే మరో నిర్ణయం తాజాగా తీసుకున్నారు. చిల్లర సమస్యలతో చికాకు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా.. ఎగువ మధ్యతరగతి.. సంపన్న వర్గాలకు చికాకు తగ్గించే మరో నిర్ణయాన్ని వెల్లడించారు. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని భారీగా పెంచిన కేంద్రం.. దాంతో పాటు.. విమానాశ్రయాల వద్ద పార్కింగ్ కు సంబంధించి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
వారం రోజుల పాటు అంటే.. వచ్చే సోమవారం వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎలాంటి పార్కింగ్ అయినా ఉచితమని ప్రకటించారు. పార్కింగ్ కు చెల్లించాల్సిన మొత్తానికి పెద్ద ఎత్తున చిల్లర నోట్లను సమర్పించుకోవాల్సి రావటం.. ఇది చికాకులు తెప్పించటంతో పాటు.. కేంద్రంపై ఆగ్రహాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో.. అందుకు చెక్ చెప్పేలా నిర్ణయం తీసుకున్నారు.
విమానాశ్రయాలతో పాటు రైల్వే స్టేషన్లలో పాత నోట్లను వినియోగించుకోవచ్చని.. రైల్వే ప్రయాణాల్లో రైల్వే క్యాటరింగ్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని సైతం పాత నోట్లను వినియోగించుకునేలా ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఈ నిర్ణయం మరింత ముందుగా ప్రకటించి ఉంటే బాగుండేది. ఇలాంటి నిర్ణయాలు మరిన్ని వెనువెంటనే తీసుకోవటం ద్వారా.. చిల్లరకష్టాలకు చెక్ చెప్పాలి. అదే జరిగితే.. తమ ఈతి బాధలు అర్థం చేసుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు సైతం అండగా నిలిచే అవకాశం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/