Begin typing your search above and press return to search.

హోట‌ల్లో ఆర్డ‌ర్ చేసిందంతా తిన‌క త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   12 April 2017 8:07 AM GMT
హోట‌ల్లో ఆర్డ‌ర్ చేసిందంతా తిన‌క త‌ప్ప‌దా?
X
మోడీ జ‌మానాలో.. ఆయ‌న ఎప్పుడేం రూల్ తీసుకొస్తారో తెలీని ప‌రిస్థితి. ఏ నిమిషాన ఏ రూల్ ప్ర‌క‌టించినా.. స‌రేన‌ని అన‌క త‌ప్ప‌నిప‌రిస్థితి. ఎందుకు? ఏమిటి? అన్న మాట నోటి వెంట రాలేని తీరులో రూల్స్‌ను ఫ్రేమ్ చేయ‌టం మోడీకే చెల్లింది. సొంత డ‌బ్బులు బ్యాంకుల్లో ఉన్నా.. ఆ డ‌బ్బుల కోసం రోడ్ల మీద గంట‌ల కొద్దీ క్యూలైన్లో నిలిచేలా చేసి.. అలా నిల‌బ‌డ‌టం దేశ‌భ‌క్తికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మంటూ ప్ర‌జ‌లు న‌మ్మేలా చేసిన స‌త్తా మోడీ సొంతం.

అలాంటి మాస్ట‌ర్ మైండ్‌.. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చేయ‌టానికి స‌రికొత్త నినాదాల్ని.. లాజిక్కుల్ని తీసుకురావ‌టం పెద్ద విష‌య‌మే కాదు. తాజాగా మోడీ దృష్టి హోట‌ళ్లు.. రెస్టారెంట్ల‌లో వృధా అవుతున్న ఫుడ్ మీద క‌న్ను ప‌డిందా? అంటే.. అవున‌నే మాట‌ను చెబుతున్నారు. స్టార్ హోట‌ళ్ల‌లోనూ.. రెస్టారెంట్ల‌లోనూ మ‌న‌కిచ్చే మెనూలో.. ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ మొత్తాన్ని తినేలా రూల్ పెట్టినా పెట్టొచ్చ‌న్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌ ను పెద్ద ఎత్తున వృధా చేస్తున్నార‌ని.. అందుకే.. అలాంటి వృధాను కంట్రోల్ చేయ‌టంలో భాగంగా.. ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ మొత్తాన్ని తినాల‌న్న రూల్ పెట్టే అవ‌కాశం ఉందంటున్నారు.

హోట‌ళ్లు.. రెస్టారెంట్ల‌లో ఒక వ్య‌క్తి తాను తినే దాని కంటే ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేస్తున్నార‌ని.. దీని వ‌ల్ల పెద్ద ఎత్తున ఆహారం వృధా అవుతుంద‌న్న మాట‌ను ప్ర‌ధాని మోడీ తానే స్వ‌యంగా మ‌న్ కీ బాత్‌లో వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇదే అంశంపై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. రెండు ఇడ్లీలు తినే వ్య‌క్తికి నాలుగు ఇడ్లీలు వ‌డ్డించ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిట‌న్న ప్ర‌శ్న‌ను సంధించ‌ట‌మే కాదు.. ఇలాంటి వాటి వ‌ల్ల విలువైన ఆహారం వృధా అవుతుంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేశారు. మోడీ మ‌న‌సులో ఒక అభిప్రాయం ప‌డితే.. దాన్ని రూపుమాపేందుకు ఎలా ప్లాన్ చేస్తారోప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి త‌గ్గ‌ట్లే.. హోట‌ళ్లు.. రెస్టారెంట్ల‌లో వడ్డించే వంట‌కాల ప‌రిమాణాల‌కు సంబంధించిన ఒక ముసాయిదాను రూపొందించి.. అమ‌ల్లోకి తీసుకొస్తామ‌ని కేంద్ర‌మంత్రి పాశ్వాన్ చెబుతున్నారు. సో.. ఆర్డ‌ర్ ఇచ్చే ఫుడ్ ను మొత్తం తినాల్సిన రోజు ద‌గ్గ‌ర్లోనే ఉందంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/