Begin typing your search above and press return to search.
తనను అలా వాడేస్తున్నారన్న ‘‘అల్లుడుగారు’’
By: Tupaki Desk | 30 Jun 2016 9:20 AM GMTదేశంలో మరే అల్లుడిగారికి దక్కనంత పవర్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకే దక్కిందని చెప్పుకోవాలి. పదేళ్ల యూపీఏ హయాంలో ‘అల్లుడిగారి’ హవా ఎంతన్నది బహిరంగ రహస్యమే. ఆయన తీరుపై పలు ఆరోపణలు రావటం.. కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారటం తెలిసిందే. ఇప్పటికే ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యూపీఏ హయాంలో అల్లుడిగారి భూదందా మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన ఫేస్ బుక్ లో తనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని.. ప్రభుత్వాలు తన విషయంలో ఏమీ రుజువు చేయలేవని వ్యాఖ్యానించటం గమనార్హం.
‘‘ఆధారాలు లేకుండా వారు నన్నేమీ చేయలేరు. సుమారు దశాబ్దం నుంచి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిరాధారమైన విమర్శలు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అల్లుడిగారి మీద ఉన్న ఆరోపణల్లో ముఖ్యమైన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు సంబంధించిన అంశంపై జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా కమిషన్ విచారణ పూర్తి చేసిన ఒక రోజు తర్వాత ఫేస్ బుక్ లో ఈ తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.