Begin typing your search above and press return to search.

బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

By:  Tupaki Desk   |   28 March 2021 11:30 AM GMT
బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం
X
ఏపీలో మరోసారి బడ్జెట్ సమావేశాలు లేనట్టే. కరోనా కల్లోలంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను జగన్ ప్రవేశపెడుతున్నారు. ఆర్డినెన్స్ ద్వారానే ఆమోదిస్తున్నారు.

తాజాగా జగన్ ఆమోదించిన ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభబూషణ్ హరిచందన్ ఆదివారం ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ రూపొందించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించారు. దీంతో బడ్జెట్ ఆర్డినెన్స్ ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు నెలల కాలానికి మొత్తం రూ.70,994.98 కోట్ల వ్యయానికి అనుమతించారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టు అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలోనే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. తాజాగా ఆర్డినెన్స్ తో ఏప్రిల్ లోనూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

వరుసగా ఎన్నికలు రావడం.. కరోనా కేసులు పెరగడం.. ఇదే సమయంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.