Begin typing your search above and press return to search.

జగన్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

By:  Tupaki Desk   |   14 Jun 2021 3:47 PM GMT
జగన్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం
X
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు నామినేటెడ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఎం జగన్ ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ ఆమోదిస్తారా? లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. వారిపై పలు ఫిర్యాదులు వచ్చినట్టు ప్రచారం సాగింది. కొద్దిరోజులుగా గవర్నర్ ఆమోదించడం లేదని.. పలు ఫిర్యాదులతో పక్కనపెట్టారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ గవర్నర్ ఆమోదించారు.

గవర్నర్ ఆమోదంతో సీఎం జగన్ సర్కార్ ప్రతిపాదించిన నలుగురు తోట త్రిమూర్తులు,లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్ రాజు,రమేశ్ యాదవ్ లు ఎమ్మెల్సీలుగా ఎంపిక కానున్నారు. వీరంతా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన టిడి జనార్ధన్, బీద రవిచంద్ర యాదవ్, గౌనివాని శ్రీనివాసులు, పి.శమంతకమణి ఎమ్మెల్సీ పదవులు జూన్ 12వ తేదీతో ముగిసాయి. గవర్నర్ కోటాలోని ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి వైసీపీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన కొయ్యే మోషేనురాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుంటూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ పేర్లతో ఒక జాబితాను ఏపీ ప్రభుత్వం తరుఫున గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపారు.

తోట త్రిమూర్తులు, ఇటు లేళ్ళ అప్పిరెడ్డి కారణంగా ఎమ్మెల్సీల జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని.. వారిపై క్రిమినల్ కేసులున్నాయని కొందరు ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం సాగింది. స్వయంగా జగన్ రంగంలోకి దిగి గవర్నర్ ఈ సాయంత్రం కలిశారు. రాజ్ భవన్ లో దాదాపు 40 నిమిషాల పాటు భేటి అయ్యారు. తాజాగా గవర్నర్ ఆమోదించడంతో ఈ ప్రచారం అంతా టీకప్పులో తుఫానులా చల్లబడింది.