Begin typing your search above and press return to search.
ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు
By: Tupaki Desk | 17 Nov 2021 6:00 AM GMTఆంధ్రప్రదేశ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర ఆనారోగ్యానికి గురికావడంతో అధికారులు వెంటనే ఆయన్ను విజయవాడ , నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.
ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల బృందం గవర్నర్ కు చికిత్స అందిస్తోంది. మధ్యాహ్నం లోగా గవర్నర్ బెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కరోనా దృష్ట్యా కొంతకాలంగా గవర్నర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల కాస్త అస్వస్థతకు గురైనా ఆ తర్వాత కోలుకున్నారు.
తాజాగా మరోసారి ఇబ్బంది తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను హైదరాబాద్ తరలించారు. గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన వెంట భార్య సుప్రవ హరిచందన్ ఉన్నారని తెలుస్తోంది. డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తారని సమాచారం.
వృత్తిరీత్యా హరిచందన్ న్యాయవాది. జనతాదళ్‌లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1996లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ-బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
కీలకమైన రెవెన్యూ, న్యాయ, మత్స్యాభివృద్ధి శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనను ఏపీకి గవర్నర్‌గా పంపించింది.