Begin typing your search above and press return to search.
ఢిల్లీకి ఏపీ గవర్నర్.. చంద్రబాబు ఫిర్యాదుపై ఏం చేస్తారు?
By: Tupaki Desk | 9 Nov 2021 5:30 PM GMTఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడురోజుల అధికారిక పర్యటన కోసం ఢిల్లీ బయలుదేరనున్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సుకు గౌరవ బిశ్వభూషణ్ హాజరు కానుండగా, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ వేదికగా ఉంది. సదస్సు గురువారం జరగనుండగా, విభిన్న అంశాలపై రాష్ట్రపతి గవర్నర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. మూడు రోజుల పర్యటనలో ప్రధమ పౌరుని వెంబడి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు ఉంటారు.
పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడుతో గవర్నర్ హరిచందన్ మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. అయితే.. గవర్నర్ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఎందుకంటే.. ఇటీవలే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. తమ పార్టీపై దాడులు పెరుగుతున్నాయని.. శాంతి భద్రతలు లేవని.. డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా రని.. పేర్కొంటూ.. నేరుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన.. రాష్ట్రంలో ఆర్టికల్ 356ను విధించి.. రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా రాష్ట్రపతిని కోరారు. అప్పట్లో ఇది జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనంగా మారింది.
దీనికి ముందు.. గవర్నర్‌ను కలిసిన టీడీపీ నాయకులు.. ఏపీలో పాలనపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఖరితో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్రంలో పోలీస్ రాజ్ నడుస్తోందని.. వాక్ స్వాతంత్య్రం కూడా లేకుండా పోయిందని.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని కూడా విన్నవించారు. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. నేరుగా ప్రతి గవర్నర్‌తోనూ రెండు నుంచి మూడు నిముషాలు.. రాష్ట్రపతి ఏకాంతంగా మాట్లాడతారని తెలుస్తోంది. దీంతో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరా తీసే అవకాశం ఖచ్చితంగా ఉందని అంటున్నారు.
మరీ ముఖ్యంగా సీనియర్ రాజకీయ నాయకుడు.. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా గవర్నర్‌తో ఈ సందర్భంగా.. రాష్ట్ర పతి చర్చించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఖజానా దివాలా తీస్తోందని..కొన్నాళ్లుగా జాతీయ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో కేంద్రం ఆర్థిక శాఖ కూడా సీరియస్‌గా ఉంది. ఈ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక, మరీ ముఖ్యంగా అప్పుల కోసం.. ఏకంగా గవర్నర్ పేరును చేర్చి ప్రభుత్వం గవర్నర్‌ను ఇరికించే ప్రయత్నం చేసిన విషయం తెలలిసిందే. దీనిపై గవర్నర్ వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని కూడా రాష్ట్రపతి చెప్పడం ఖాయమని.. లేకపోతు.. మున్ముందు.. ఆయన చిక్కుల్లో పడితే.. కేంద్రం అప్పుడు నిలదీస్తుందని.. కాబట్టి అన్ని విషయాలు చర్చకు వస్తాయని అంటున్నారు.