Begin typing your search above and press return to search.
మళ్లీ గవర్నర్ ఏకపక్ష వైఖరి
By: Tupaki Desk | 26 Nov 2015 7:21 AM GMTఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికే మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీకే అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ...కేసీఆర్ తో ఒకలా చంద్రబాబుతో మరోలా ఉంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో సెక్షన్-8 అమలుచేయడంలోనూ గవర్నర్ ఏపీ ప్రభుత్వంపై వివక్ష చూపించారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కేంద్రం జోక్యంతో మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం అంతా సవ్యంగానే జరుగుతుందనుకుంటున్న తరుణంలో మళ్లీ గవర్నర్ కు - ఏపీ ప్రభుత్వానికీ మధ్య వివాదం మొదలయ్యేలా ఉంది. ఏపీకి ఎన్నికల కమిషనర్ నియామకంపై గవర్నర్ తీరు మళ్లీ కొత్త సమస్యకు తావిస్తోంది.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం అనివార్యమైంది. ఇప్పుడు ఈ కమిషనర్ ఎంపిక వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ కు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయన్న విషయం ఆసక్తికరంగా ఉంది. వివాదం ఎలా మొదలైందంటే.. ఐఎఎస్ అధికారిగా.. ఏపీపీఎస్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన చిత్తరంజన్ దాస్ బిశ్వాల్ ను ఈ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ మేరకు గవర్నర్ కు సిఫార్సు చేశారు.
గవర్నర్ నరసింహన్ రాజ్యాంగాన్ని పరిశీలించి ఆర్టికిల్ 319( బి) ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినవారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవులకు మాత్రమే అర్హులని... వారు మరే పదవిలో నియమించడానికి అర్హులు కాదని పేర్కొన్నారట. అంతేకాక చీఫ్ సెక్రటరీ ర్యాంకు వారే ఈ పదవి కి అర్హులని, బిస్వాల్ కు సి.ఎస్.ర్యాంకు లేదని గవర్నర్ ఫైల్ ను తన వద్దే ఆపారని సమాచారం. అయితే మాజీ ఏపీపీఎస్పీ చైర్మన్ రాములుకు తెలంగాణ ప్రభుత్వం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సంగతిని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ పదవి గవర్నర్ పరిధిలోది కాదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నాయి. మరి సమసిపోయాయనుకుంటున్న సమస్యలు మళ్లీ ఈ వ్యవహారంతో మొదటికి వస్తాయో.. లేక సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయో వేచిచూడాలి.