Begin typing your search above and press return to search.
వెలగపూడి అసెంబ్లీ సాక్షిగా హోదా లేదనేశారు
By: Tupaki Desk | 7 March 2017 5:20 AM GMTవిభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సర్కారు పూర్తిగా చేతులు ఎత్తేయటమే కాదు.. హోదా లేకున్నా.. ప్రత్యేక ప్యాకేజీ ఉందిగా అన్న రీతిలో చెబుతున్న మాటలు విస్తుపోయేలా చేస్తున్నాయి. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయటంలో హోదా కీలకమన్న విషయాన్ని మర్చిపోకూడదు. విభజన సరిగా జరగలేదని.. జరిగిన తీరు తన గుండె మండేలా చేస్తుందని.. ఆ మంటతో వచ్చే కసితో మరింతగా పని చేస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఏపీ ప్రయోజనాల కంటే తన రాజకీయప్రయోజనాలే ముఖ్యమన్న విషయాన్ని తాజాగా మరోసారి తేల్చేశారు.
వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టేయటమే కాదు.. హోదాను ప్రత్యేకప్యాకేజీతో భర్తీ చేసేసినట్లుగా చెప్పేయటం గమనార్హం. విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీపై ఆశలు వదులుకోవాలన్న విషయాన్ని గవర్నర్ నోటనే చెప్పించింది బాబు సర్కారు.
ప్రత్యేకహోదాను ఇచ్చే అవకాశం లేదంటూ.. కేంద్రం తీరును చెప్పేస్తూనే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం హోదాను విరమించుకుందన్నారు. ప్రత్యేకహోదా స్థానంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయానికి.. హోదాకు మధ్య తేడా లేదని.. కేవలం పేరుమార్పు మాత్రమేనన్న మాటను చెప్పించటం గమనార్హం. ఈ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతను తాము కోరుతున్నట్లుగా వెల్లడించింది.
మొత్తానికి ఏపీ గడ్డ మీద తొలిసారి ఏర్పాటు చేసిన చారిత్రక అసెంబ్లీ సమావేశాల్లో ఆరంభంలోనే ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసే విషయాన్ని గవర్నర్ నోటి నుంచి ఏపీ సర్కారు చెప్పించటం గమనార్హం. గవర్నర్ ప్రసంగ పాఠంతో హోదా విషయంలో ఏపీ ప్రయోజనాల్ని దెబ్బేయటంలో కేంద్రానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో బాబు సర్కారు వ్యవహరించిందన్న విషయం తేలిపోయినట్లే. ఇక.. ఉభయ సభల్ని ఉద్దేశించిన గవర్నర్.. 90 పేజీల ప్రసంగ పాఠాన్ని గంటన్నర వ్యవధిలో చదివేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/