Begin typing your search above and press return to search.
అదృష్టం ఉంటే ఉప రాష్ట్రపతి అవుతా: గవర్నర్
By: Tupaki Desk | 15 Jun 2017 7:18 AM GMTరాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం మొదలై ఇప్పటికే వేర్వేరు పేర్లు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి రేసులో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేరు వార్తల్లో వినిపించింది. ఉమ్మడి గవర్నర్ గా వ్యవరిస్తున్న నరసింహన్ ను ఉపరాష్ట్రతిగా చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందు అనంతరం గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ మీడియాతో కాసేపు ప్రత్యేకంగా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పదవి గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఇప్తార్ అనంతరం మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మీరు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయబోతున్నారనే సంకేతాలు ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్నాయి…దీనిపై మీ కామెంట్ ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, అంతటి అత్యున్నత పదవి తనకు వస్తుందని అనుకోవడం లేదన్నారు. ఆ రేసులో తాను లేనని నవ్వుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరగా పదవులు భగవంతుడే నిర్ణయిస్తాడని - దేవుడి కృప - అదృష్టం ఉంటే ఉపరాష్ట్రపతి పదవి రావచ్చునేమోనని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ హయాంలో ఏపీకి గవర్నర్ గా నరసింహన్ వచ్చారు. ఆయనతో పాటుగా నామినేట్ అయిన వారిలో మెజార్టీ సభ్యులను ఎన్డీఏ ప్రభుత్వం ఆ పదవుల నుంచి తొలగించింది. అయినప్పటికీ బీజేపీ ఇప్పటివరకు కొనసాగించడం విశేషమే. అదే రేసులో ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేసే చాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ చేస్తున్న సేవలు ప్రధాని నరేంద్రమోడీని ఆకట్టుకున్నాయని, అంతేకాకుండా ఐపీఎస్ అధికారిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవం నరసింహన్ కు ఉన్నాయని.. ఈ అనుభవం కూడా దానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టే ఉపరాష్ట్రపతికి ఆయన తగిన వ్యక్తి అని మోడీ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/