Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు గవర్నర్ క్లీన్‌చిట్..?
By: Tupaki Desk | 10 Jun 2015 5:26 AM GMTటైం బాగోలేనప్పుడు.. బలహీనతల్ని ఒక్కసారిగా విరుచుకుపడతాయన్నట్లుగా ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఉంది. ఆపరేషన్ రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రికి గవర్నర్ బాసటగా నిలిచే అవకాశాలు అస్సలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన పట్ల ప్రేమను.. విధేయతను ప్రదర్శించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల గవర్నర్ కాస్తంత సానుకూలత ప్రదర్శిస్తున్నారా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం లభిస్తోంది.
ఆపరేషన్ రేవంత్‌రెడ్డి ఇష్యూలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ వ్యవహారంలో తెలంగాణ సర్కారు ఇబ్బంది పడుతోంది. మిగిలిన విషయాల మీద విరుచుకుపడే తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ట్యాపింగ్ విషయం దగ్గరకు వచ్చే సరికి మాత్రం అందరూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని.. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే.. ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన మినహా మిగిలిన వారి మాటలన్నీ డిఫెన్స్‌లో పడ్డట్లు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లను ట్యాప్ చేసే అంశం రేవంత్‌రెడ్డి ఇష్యూ కంటే సీరియస్ అంశం కావటంతోనే తెలంగాణరాష్ట్ర మంత్రులు ఆచితూచి మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయితే.. ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించిందని.. దీనిపై సీరియస్ కావటంతో పాటు..ఈ అంశంపై గవర్నర్ నరసింహన్‌ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ అంశంపై హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో గవర్నర్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌పై ఎలాంటి ట్యాపింగ్‌చేయలేదని చెప్పినట్లు చెబుతున్నారు. ఒక సీఎం ఫోన్ ట్యాప్ చేస్తుంటే మీరేం చేస్తున్నారన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని.. తెలంగాణ సీఎం కేసీఆర్ అలాంటి చర్యకు పాల్పడలేదని స్పష్టంగా చెప్పినట్లు చెబుతున్నారు.
రేవంత్‌రెడ్డి తదనంతర అంశాలపై కేంద్రం దృష్టి సారించినప్పుడు.. గవర్నర్ నివేదిక కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్‌కు.. ఏపీ సర్కారుకు మధ్య సత్ సంబంధాలు లేని విషయం తెలిసిందే. దీనికి తోడు.. గవర్నర్ తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గవర్నర్ మాటకు ప్రాధాన్యత పెరిగిన పరిస్థితి. అయితే.. ఇలాంటి సందర్భాల్లో ఇరు పక్షాలకు చెందని వ్యక్తిగా మాట్లాడాల్సిన గవర్నర్.. కేసీఆర్‌కు సంబంధించి క్లీనచిట్ ఇచ్చారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆపరేషన్ రేవంత్ వ్యవహారం మొత్తం రాజకీయ స్పర్థల నేపథ్యంలో చోటు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించకుండా.. ట్యాపింగ్ అస్సలు జరగలేదని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పనులకు పాల్పడలేదంటూ కేంద్రానికి గవర్నర్ చెప్పినట్లుగా చెబుతున్న మాటను కేంద్రం విశ్వసిస్తుందా? దానికి తగినట్లు వ్యవహరిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. బాబు తన వాదనను వినిపిస్తున్న క్రమంలో.. కేంద్రం అనుసరించే వైఖరి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.