Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న గవర్నరు
By: Tupaki Desk | 23 Oct 2019 2:30 PM GMTతెలంగాణ గవర్నరు తమిళసై స్పీడుకు సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. ఆమె తెలంగాన గవర్నరుగా పదవి చేపట్టిన కొద్దిరోజుల్లోనే యాక్టివ్‌గా వ్యవహరిస్తూ వివిధ శాఖలతో సమీక్షించారు. అంతేకాదు... ఆర్టీసీ సమ్మె విషయంలోనూ రవాణా శాఖ మంత్రి, అధికారులను పిలిచి పరిస్థితులు తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశాలిచ్చారు.
ఇప్పుడామె చేపట్టనున్న మరో కార్యక్రమం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టబోతోంది. గిరిజన గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని ఆమె తలపోస్తున్నారు. దీంతో అక్కడి సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు అన్నీ బయపడబోతున్నాయి.
గిరిజన సంక్షేమ శాఖతో చేపట్టిన ఓ సమీక్ష కార్యక్రమంలో గవర్నరు ఈ మేరకు తన ఆకాంక్షను బయటపెట్టారు. తాను వైద్యాధికారిగా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లో వారితో పాటే ఉన్నానని.. అక్కడే ఉంటూ వారికి వైద్య సేవలందించానని ఆమె చెప్పారు. గిరిజనుల మధ్యే ఉంటూ వారి సంస్కృతి, సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే సరైన పరిష్కారాలు అందించగలమని ఆమె అన్నారు.
నిజానికి గవర్నరు వివిధ శాఖలతో సమీక్షలు చేపట్టినప్పుడే ప్రభుత్వానికి సెగ మొదలైంది. ఇప్పుడామె మరింత ముందుకెళ్లి ప్రజల మధ్యకు వెళ్తానంటుండడంతో సీఎం, మంత్రులు సిగ్గు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల్లోకి వెళ్లడంతగ్గిపోయింది. ఆయన సెక్రటేరియట్‌కు కూడా రాకుండా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిగా పేరుపడ్డారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా ఆయన మంత్రులూ ఎప్పుడో ప్రజలున మర్చిపోయారు. అలాంటి సమయంలో గవర్నరు ప్రజల్లోకి వెళ్తానంటుండడం సీఎం, మంత్రులను ఇబ్బంది పెడుతోంది. మరోవైపు గవర్నరు సీఎంను నామమాత్రం చేసి పాలన సాగించే దిశగా అడుగులేస్తున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.