Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ సాబ్‌ కు రెండు క‌ళ్లంట‌!

By:  Tupaki Desk   |   1 Aug 2018 10:10 AM GMT
చంద్రుళ్లు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ సాబ్‌ కు రెండు క‌ళ్లంట‌!
X
ఏం సెబుతిరి.. ఏం సెబుతిరి అన్న‌ట్లుగా పిచ్చ కామెడీ మాట‌ను చెప్పేశారు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్. ప్ర‌శ్న వేసింది పిల్లాడైనా.. పిడుగు లాంటి క్వ‌శ్చ‌న్ వేసి.. గ‌వ‌ర్న‌ర్ గారి నోటి నుంచి కామెడీ మాట చెప్పేశారు. అదేంటండి.. అంత పెద్ద గ‌వ‌ర్న‌ర్ సాబ్ ను ప‌ట్టుకొని అలా అనేస్తార‌న్న సందేహం అక్క‌ర్లేదు. లేక‌పోతే.. నిత్యం తాను చేసే ప్ర‌తి ప‌నిని పూస గుచ్చిన‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. తాను చేప‌ట్టబోయే ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి వివ‌రంగా మాట్లాడే కేసీఆర్ ను.. అమావాస్య‌కో.. పౌర్ణానికో అన్న‌ట్లు ఎప్పుడో క‌లిసే చంద్ర‌బాబు ఒక్క‌టేనా ఏంది?

ఆ మాట‌కు వ‌స్తే.. గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. తాను ప్రాణ‌ప‌దంగా ప్రేమించే ఫాం హౌస్.. ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టించుకున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ త‌ర్వాత‌.. ఎక్కువ‌సేపు కేసీఆర్ గ‌డిపే ప్లేస్ ఏదైనా ఉందంటే.. అది గ‌వ‌ర్న‌ర్ సార్ వారి రాజ్ భ‌వ‌నే. ఎవ‌రితో షేర్ చేసుకోని అంశాలు కూడా గ‌వ‌ర్న‌ర్ తో చెప్పుకొంటార‌ని చెబుతుంటారు.

మ‌రి.. అలాంటి కేసీఆర్ కు.. అక్క‌డెక్క‌డో అమ‌రావ‌తిలో ఉండే చంద్ర‌బాబు ఒక్కటేనంటే కామెడీ కాక మ‌రేంది? ఇంత‌కీ ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఎవ‌రికి ఎక్కువ ప్రాధాన్య‌త అన్న చిక్కు ప్ర‌శ్న‌ను గ‌వ‌ర్న‌ర్ కు సంధించినోళ్లు ఎవ‌రు? అలాంటి క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్లో క‌ర్ర విర‌క్కుండా.. పాము చావ‌ని రీతిలో స‌మాధానాలు చెప్పేదానికి బ‌దులు.. అంత సూటిగా ఎందుకు స‌మాధానం చెప్పార‌న్న దానిలోకి వెళితే.. కాస్త లోతుల్లోకి వెళ్లాలి.

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స్కూలింగ్ హైద‌రాబాద్‌ లోని లిటిల్ ప్ల‌వ‌ర్ స్కూల్లోనే సాగింద‌ట‌. తాను స్టూడెంట్‌ గా వెళ్లిన బ‌డికి.. రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరుడి హోదాలో వెళ్లే అదృష్టం ఎంత‌మందికి ద‌క్కుతుంది. ఈ భావోద్వేగంలో ఉన్న వేళ‌.. అదే స్కూల్లో చ‌దివే విద్యార్థుల‌తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల‌కు తాను చెప్పాల్సిన పెద్దరికం మాట‌ల్ని చెప్పిన ఆయ‌న్ను.. పిల్ల‌లు త‌మ‌కు తోచిన ప్ర‌శ్న వేయొచ్చ‌న్న ఆఫ‌ర్ ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక విద్యార్థి గ‌వ‌ర్న‌ర్ కు సిత్ర‌మైన సందేహ‌న్ని సంధించాడు.

మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్య‌మంత్రి అంటే ఇష్ట‌మ‌ని ప్ర‌శ్నించాడు. దీనికి బ‌దులిచ్చిన గ‌వ‌ర్న‌ర్‌.. త‌న‌కు రెండు రాష్ట్రాలు రెండు క‌ళ్లు లాంటివ‌ని.. రెండింటిలో ఏది ఇష్టమంటే చెప్ప‌లేన‌ని.. రెండూ స‌మాన‌మేన‌ని చెప్పారు. అంతేనా.. నీకు రెండు క‌ళ్ల‌ల్లో ఏది ఇష్ట‌మని ప్ర‌శ్నిస్తూ.. త‌న‌కు అలానే అని చెప్పారు.

ఈ స‌మాధానం విన్నంత‌నే చాలామందికి చాలా గుర్తుకు వ‌చ్చాయి. అప్పుడెప్పుడో రాష్ట్ర విభ‌జ‌న వేళ‌లో.. ఇదే త‌ర‌హాలో చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని చెప్ప‌టం.. అది కాస్తా త‌ర్వాతి రోజుల్లో ఎంత కామెడీ అయ్యిందో తెలిసిందే. తాజాగా గ‌వ‌ర్న‌ర్ సైతం చ‌మ‌త్కారంగా వ్యాఖ్య చేయ‌ట‌మే కాని.. ఏ ముఖ్య‌మంత్రికి ఆయ‌న‌ ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తార‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. మొత్తానికి చిన్న‌పిల్లాడు వేసిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ గ‌వ‌ర్నర్ అంద‌రి దృష్టిని త‌న మీద ప‌డేలా చేసుకున్నారు.