Begin typing your search above and press return to search.
తుమ్మల మాట గవర్నర్ కు వినిపించలేదా?
By: Tupaki Desk | 20 July 2015 5:42 AM GMTఎక్కడికైనా వీఐపీలు వస్తుంటే రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతుంటారు. వారి కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. వారు సంతసించేలా పనులు చేస్తారు. కానీ.. గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాస్త భిన్నం. పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం చేసేందుకు ఖమ్మం జిల్లా భద్రాచలానికి వీఐపీలు ఎవరూ రావొద్దని ఓపెన్ గా చెప్పేశారు.
వీఐపీలు వస్తే.. వారికి సదుపాయాలు కల్పించట కష్టమని.. సాధారణ ప్రజలు ఇబ్బందులు గురి అవుతారని.. అందుకే.. భద్రాచలం ఘాట్ కు కాకుండా.. బూర్గంపాడు.. మోతె లాంటి ఘాట్లకు వెళ్లాలని సూచించారు. నిజానికి ఇలాంటి ప్రకటన చేయటానికి ధైర్యం కావాలి. ఎవరు ఏమనుకుంటారో అన్న భయం లేకుండా.. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నిర్మోహమాటంగా రావొద్దని చెప్పేశారు.
వీఐపీలు ఎవరూ భద్రాచలం రావొద్దని చెప్పినా.. సోమవారం గవర్నర్ నరసింహన్.. ఏపీలో రాజమండ్రికి.. తెలంగాణలో భద్రాచలంలో పుణ్య స్నానం చేయటానికి సిద్ధమయ్యాయిరు. వీఐపీలు వస్తే ఇబ్బంది అని చెప్పినప్పటికీ గవర్నర్ వెళ్లటం కాస్త ఆసక్తికరమే.
పుష్కర స్నానం ఎవరు ఎక్కడైనా చేయొచ్చని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లే గవర్నర్ లాంటి ప్రముఖులు నడుచుకుంటే బాగుండేది. పేరు ప్రఖ్యాతులున్న ప్రాంతంలో కాకుండా.. పెద్దగా జనసంద్రం లేని ప్రాంతాల్ని ఎంపిక చేసుకుంటే బాగుండేది. అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహన్ సోమవారం మొదట రాజమండ్రి.. తర్వాత ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. చూస్తుంటే.. తుమ్మల మాటలు గవర్నర్ కు వినిపించలేదా.. ఏమిటి..?