Begin typing your search above and press return to search.

మరీ ఇంత పాత చింతకాయ పచ్చడైతే ఎలా?

By:  Tupaki Desk   |   5 March 2016 11:43 AM GMT
మరీ ఇంత పాత చింతకాయ పచ్చడైతే ఎలా?
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం మధ్యహ్నం మూడు గంటలకు ఏపీ అసెంబ్లీ షురూ అయ్యింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని విపక్ష సభ్యులు ఎవరూ అడ్డుకోకపోవటం గమనార్హం. గవర్నర్ తన ప్రసంగంలో ఎప్పటి మాదిరే..అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి.. పాత చింతకాయ పచ్చడి మాదిరి విభజన వల్ల నష్టాలు మొదలు.. హామీల మీద హామీలు.. ప్రభుత్వం చేస్తున్న పనులు.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. త్వరలో చేపట్టనున్న పనుల గురించి ప్రస్తావించారు.

మొత్తంగా చూస్తే.. పాత విషయాల్నే గవర్నర్ ప్రస్తావించినట్లుగా కనిస్తుంది. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు చూస్తే...

= కాపు.. బలిజ.. ఒంటరి.. తెలగ కులాలకు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయిలు

= రిజర్వేషన్ కు సంబంధించి మంజునాథ కమిషన్ 8 నెలల్లో నివేదిక ఇవ్వనుంది.

= రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును 7 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా ఇస్తున్నాం. విద్యుత్ పంపిణీ నష్టాల్ని 10.29శాతానికి తగ్గించాం.

= వచ్చే ఏడాదికి సింగిల్ డిజిట్ కు తగ్గిస్తాం.

= ఉపకార వేతనాల్ని ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెలా చెల్లించే పద్ధతి షురూ.

= వసతి గృహాల్లో బయోమెట్రిక్ అమల్లోకి తీసుకొస్తాం.

= ఎస్సీ.. ఎస్టీ, బీసీల ఉప ప్రణాళిక ప్రకారం నిధులు వెచ్చిస్తున్నాం.

= రూ.70వేల కోట్ల అంచనాతో జాతీయ రహదారుల విస్తరణ. 1250 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటన

= ఉభయ గోదావరి.. కృష్ణా జిల్లాలకు నగర గ్యాస్ పంపిణీ

= రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్‌ వర్సిటీల బిల్లు తెచ్చాం.

= 7 ప్రధాన జాతీయ సంస్థలను కేంద్రం మంజూరు చేసింది. వాటిలో 5 విద్యా సంస్థలను ప్రారంభించాం.

= రుణమాఫీకి రూ.7,433 కోట్లు చెల్లించాం.

= రాష్ట్రాన్ని ఆక్వా వరల్డ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు మత్స్య పరిశ్రమ విధానం ప్రకటించాం.

= వెలిగొండ ప్రాజెక్టును 2017 జూన్ నాటికి పూర్తి చేస్తాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఐదున్నర నెలల రికార్డు సమయంలో పూర్తి చేశాం.

= గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాకు 8 టీఎంసీల నీటిని తీసుకొచ్చాం.

= విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విజయవంతంగా నిర్వహించాం.

= రాష్ట్రంలో 2019-2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించటమే మేం పెట్టుకున్న లక్ష్యం.