Begin typing your search above and press return to search.

తెలంగాణ దూసుకెళుతోందన్న గవర్నర్

By:  Tupaki Desk   |   10 March 2016 7:00 AM GMT
తెలంగాణ దూసుకెళుతోందన్న గవర్నర్
X
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షురూ అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. తెలుగులో తన ప్రసంగాన్ని షురూ చేసిన గవర్నర్.. తర్వాత ఇంగ్లిషులోకి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్లిపోతుందన్న ఆయన.. ప్రభుత్వం సాధించిన ఘనతల్ని చెప్పే ప్రయత్నం చేశారు. క్లుప్తంగా సాగిన గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ సర్కారు చేపట్టిన పథకాలు.. చేస్తున్న అభివృద్ధి.. చేయనున్న కార్యక్రమాల గురించి చెప్పేప్రయత్నం చేశారు.

ముందుగా ఊహించినట్లే.. మహారాష్ట్ర సర్కారుతో ఇటీవల జరిగిన ఒప్పందాల్ని ఘనంగా కీర్తించుకోవటంతో పాటు.. చారిత్రక ఒప్పందంగా వెల్లడించారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్న మాటతోపాటు.. రెండెంకల వృద్ధిరేటును తెలంగాణ సాధించిన విషయాన్ని ప్రకటించారు. అందరిని ఆకట్టుకునేలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంటుందన్న మాట చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే..

= గోదావరి నదిపై మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది

= మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి

= డబుల్ బెడ్ రూం.. కళ్యాణ లక్ష్మీ.. షాదీ ముబారక్ గొప్ప పథకాల్ని అమలు చేస్తోంది

= 2026 నాటికి ప్రతి ఇంటికి రోజుకు 100 లీటర్ల నీరు

= హైదరాబాద్ లో నాలుగు కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు

= శిశు మరణాల రేటు తగ్గింపునకు కృషి చేస్తోంది

= మిషన్ భగీరథకు అత్యధిక ప్రాధాన్యం

= ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు

= వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్

= కోటి ఎకరాలకు సాగునీటి అందించటమే లక్ష్యం

= పరిశ్రమలకు సింగిల్ విండో తో అనుమతులు

= కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి అయ్యింది

= టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి

= గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీ హబ్ తో యువతకు భారీ ప్రయోజనం

= రాష్ట్రంలో 11.7శాతం వృద్ధి రేటును నమోదు చేసింది

= విద్యుత్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం

= అందరూ మెచ్చేలా బడ్జెట్ ఉంటుంది

= టెక్స్ టైల్ హబ్ గా వరంగల్ ను వృద్ధి చేస్తాం

= ఇప్పటిదాకా సంక్షేమ హాస్టల్స్ కు అందిస్తున్న సన్నబియ్య ఇకపై కాలేజీ హాస్టల్స్ కూడా

= షీ టీమ్స్ తో ఈవ్ టీజింగ్ కు కళ్లెం వేస్తున్నాం

= అన్ని జిల్లా కేంద్రాలకు 4 లైన్ల రోడ్ల ఏర్పాటు