Begin typing your search above and press return to search.

పేచీ..రాజ‌కీయాలు ఇంట్లో గొడ‌వ‌లంటున్న గ‌వ‌ర్న‌ర్‌

By:  Tupaki Desk   |   9 Jan 2018 9:52 AM GMT
పేచీ..రాజ‌కీయాలు ఇంట్లో గొడ‌వ‌లంటున్న గ‌వ‌ర్న‌ర్‌
X
తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ పర్యటలనో ఉన్న గవర్నర్ నరసింహన్.. కేంద్ర హోంహంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ తో మంగళవారం ఉదయం సమావేశమై రెండు రాష్ర్టాల రాజకీయ - పరిపాలన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. రాజ్ నాథ్ తో భేటీ ముగిసిన అనంతరం గవర్నర్ నరసింహన్‌ ను మీడియా పలుకరించింది. గవర్నర్ నరసింహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు - తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా గవర్నర్ ను ప్రశ్నించగా ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు.

ఏపీ బీజేపీ - తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మీపై ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్న ప్రశ్నకు సమాధానంగా...`ఒకే కుటుంబలో పెద్దలకు పిల్లలకు మధ్య వాదం వివాదం మనస్థాపాలు ఉంటాయి. అవి సహజం కోపతాపాలు సర్దుకుంటాయి. బంధాలను విడగొట్టలేం కదా?. ఈ విషయం కుటుంబ వ్యవహారం దానిపై బయట మాట్లాడకూడదు.` అని ఆయ‌న సూచించారు. తెలుగు రాష్ర్టాల‌కు తాత్కాలిక గవర్నర్ గా కొనసాగుతున్నారు కదా?పదవి పొడిగింపు పై ప్రధాన మంత్రి తో చర్చిస్తారా అని మీడియా ప్ర‌శ్నించ‌గా...`అలాంటిది ఏమీలేదు` అని గవర్నర్ రియాక్ట‌య్యారు. మర్యాద పూర్వకంగా ప్రధాన మంత్రిని కలుస్తానని చెప్పారు.

ఏపీ విభజన చట్టంలోని పలు అంశాలు అమలులో పెండింగ్ లో ఉన్నాయి కేంద్రంతో చర్చిస్తానని గవర్నర్ నరసింహన్ అన్నారు.విభజన చట్టంలోని కొన్ని సమస్యలు మాత్రమే పెండింగ్‌ లో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్‌ భవన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కొన్ని సూచనలు చేశానని నరసింహన్ చెప్పారు. ప్రజలకు రాజ్‌ భవన్‌ ను మరింత చేరువ చేస్తామన్నారు. పచ్చదనం - పరిశుభ్రత అంశాలపై దృష్టి సారించామని గవర్నర్ ఉద్ఘాటించారు.బెస్ట్ ఎండ్ కామన్ ప్రాక్టీస్ రిపోర్టును (సంస్కరణల పై వేసిన కమిటీ నివేదికను)కమిటీ చైర్మన్ గా రాష్ట్రపతికి అందజేస్తానని వివ‌రించారు.