Begin typing your search above and press return to search.
మీడియా తప్పుల్ని ఎత్తి చూపిన గవర్నర్!
By: Tupaki Desk | 14 Feb 2019 5:41 AM GMTఅవకాశం వచ్చే చెలరేగిపోవటం కొందరిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో మరికొందరు ప్రముఖులు తీరు వేరుగా ఉంటుంది. తమకు సందేశం ఇచ్చే అవకాశాన్ని వారు మిస్ చేసుకోకుండా.. కొన్ని వర్గాలుచేసే తప్పుల్ని టార్గెట్ చేస్తూ సూచనలు చేసే ప్రయత్నం చేస్తుంటారు.
రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వ్యవహరశైలి ఎలా ఉన్నా.. కొన్ని సామాజిక అంశాల మీద ఆయన ఆలోచనలు నవ్యంగా ఉండటమే కాదు.. నిర్దుష్టంగా ఉండటం కనిపిస్తుంది. ప్రభుత్వాధినేత తనకు ఎంత సన్నిహితుడైనా.. కొన్ని సామాజిక అంశాల్ని.. ప్రభుత్వంలోని లోటుపాట్లను.. సిస్టంలోని తప్పుల్ని ఎత్తి చూపించే విషయంలో గవర్నర్ అస్సలు వెనుకాడరు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం.. విద్యతో పాటు పలు అంశాల్ని ప్రస్తావించే గవర్నర్ నరసింహన్ తాజాగా మీడియా మీద కొన్ని చురకలు వేశారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియా వ్యవహరిస్తున్న తీరుతో పాటు.. మహిళల విషయంలో సమాజం మైండ్ సెట్ ను తప్పు పట్టారు.
ఆడపిల్లను మహాలక్ష్మితో పోలుస్తామన్న ఆయన.. అలాంటి వారిని చులకనగా చూడటం.. వివక్షకు గురి చేయటం దారునంగా అభివర్ణించారు. ఆడవాళ్లను గౌరవించటం.. మర్యాదగా వ్యవహరించటం అన్నది ఎవరికి వారింటి నుంచే మొదలు కావాలన్నారు. ఎవరైనా బాలిక కానీ మహిళ కానీ లైంగిక దాడికి గురైతే.. ఆ సమాచారాన్ని.. వీడియోలను అదే పనిగా టీవీల్లో ప్రసారం కావటాన్ని తప్పు పట్టారు. బ్రేకింగ్ లు వేసి మరీ చూపించటం ఏమిటి? ఇది మంచి పద్దతి కాదన్నారు.
మీడియా చేసే ఇలాంటి చర్యలతో బాధితులు మరింత కుంగిపోతారని.. ఆత్మన్యూనతకు గురి అవుతారన్నారు. ఏదైనా కంపెనీకి ఎవరైనా మహిళ ఒకరు సీఈవోగా నియమితులైతే. మహిళా సీఈవో అని పదే పదే రాస్తుంటారని.. ఇలాంటి తీరు మార్చుకోవాలన్నారు. మీడియాకు గవర్నర్ చెప్పే నీతులు ఎంత వరకూ తలకెక్కుతాయో?