Begin typing your search above and press return to search.

జగన్ తో గవర్నర్ ప్రమాణం..ఓ అరుదైన రికార్డ్

By:  Tupaki Desk   |   28 May 2019 8:02 AM GMT
జగన్ తో గవర్నర్ ప్రమాణం..ఓ అరుదైన రికార్డ్
X
గవర్నర్ నరసింహన్.. కాంగ్రెస్ పాలించిన యూపీఏ హయాంలో గవర్నర్ గా నియామకమయ్యారు. కాంగ్రెస్ వాదిగానే విధులు నిర్వర్తించారు. 2014లో మోడీ ప్రధాని అయ్యాక అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను తొలగించారు. తమిళనాడు గవర్నర్ గా రోశయ్యను కూడా పదవీకాలం ముగిశాక పొడగించలేదు.కానీ ఒక్క నరసింహన్ మాత్రమే బీజేపీ పెద్దల అభిమానం చూరగొని రెండోసారి కూడా గవర్నర్ గా నియమితులు కావడం విశేషంగా చెప్పవచ్చు..

2010 జనవరిలో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా నరసింహన్ నియమితులయ్యారు. 1968 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన నరసింహన్ యూపీఏ హయాంలో కీలకమైన ఐబీ చీఫ్ గా పనిచేశారు. 2006లో రిటైర్ అయిన ఈయన్ను యూపీఏ ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత చత్తీస్ ఘడ్ గవర్నర్ ను చేసింది. అనంతరం వైఎస్ మరణంతో తెలంగాణ ఉద్యమం, రోశయ్య అదుపుచేయలేకపోవడంతో ఏపీ గవర్నర్ గా 2010లో మార్చింది.

2014లో మోడీ గద్దెనెక్కాక నరసింహన్ ను మారుస్తారని అందరూ భావించారు. కానీ విభజన సమస్యలు - రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి కొట్టుకోవడాలు చేస్తుండడంతో అన్నీ తెలిసిన నరసింహన్ అయితే బెటర్ అని మోడీ ఈయనను కొనసాగించాడు. ఇక మోడీకి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తూ ఆయన అభిమానాన్ని నరసింహన్ చూరగొన్నాడు. ఇలా 2014 తర్వాత కూడా కొనసాగుతున్నారు.

ఇప్పటికీ గవర్నర్ నలుగురు సీఎంల చేత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి రికార్డు నెలకొల్పడం విశేషం. రోశయ్య తర్వాత 2010 డిసెంబర్ 25న కిరణ్ కుమార్ రెడ్డితో మొదలైన నరసింహన్ ప్రమాణాల పర్వం.. ఆ తర్వాత 2014లో జూన్ 2న తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ - జూన్ 8న నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబుతో.., గత డిసెంబర్ లో కేసీఆర్ తో రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణం చేయించారు. ఇప్పుడు వైఎస్ జగన్ తో 5వ ప్రమాణాన్ని నరసింహనే చేయిస్తుండడం విశేషంగా మారింది. ఒక్క గవర్నర్ 5 సార్లు సీఎంల చేత ప్రమాణం చేయించడం దేశ చరిత్రలోనే ఓ రికార్డ్ అట.. ఆ రికార్డ్ వైఎస్ జగన్ ప్రమాణంతోనే ముడిపడి ఉండడం విశేషంగా మారింది. .