Begin typing your search above and press return to search.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ మార్పు త‌థ్య‌మా..?

By:  Tupaki Desk   |   29 Aug 2019 10:12 AM GMT
తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ మార్పు త‌థ్య‌మా..?
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌ గా సుధీర్ఘంగా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స‌మ‌యంలో ఆయ‌న తీసుకున్న చొర‌వ‌ - ప‌రిపాల‌న ద‌క్ష‌త అనిర్వ‌చ‌నీయ‌మైన‌ది. తెలుగు రాష్ట్రాలు రెండుగా విభ‌జించిన త‌రువాత కూడా రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ గా ఐదున్న‌రేండ్లు పనిచేసిన గ‌వ‌ర్న‌ర్‌ గా చెరిగిపోని ముద్ర‌వేసుకున్నాడు.. గ‌వ‌ర్న‌ర్‌ గా ఎన‌లేసి సేవ‌లందించిన ప్ర‌స్తుత తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఈఎస్‌ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ను ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం మార్చుతుందా? అనే అనుమానాల‌కు భీజం వేశారు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహానే.

గ‌వ‌ర్న‌ర్‌ గా సుధీర్ఘ‌సేవ‌లందించిన ఈఎస్‌ ఎల్ న‌ర‌సింహాన్ పై వేటు వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మైంద‌నే సంకేతాలు ఇచ్చాడు గ‌వ‌ర్న‌ర్‌. బ్యాట్మింట‌న్ ప్ర‌పంచ ఛాంపియ‌న్‌ గా బంగారుపత‌కం సాధించిన పీవీ సిందు మ‌ర్యాద పూర్వకంగా గ‌వ‌ర్న‌ర్‌ ను హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ లో క‌లిసింది. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ పీవీ సింధును శాలువాతో స‌న్మానించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

పీవీ సింధు సాధించిన ఈ విజ‌యంతో భార‌త‌దేశం గ‌ర్విస్తోంది. తాను గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్నా లేకున్నా 2020లో జ‌రిగే ఒలంపిక్ క్రీడ‌ల్లో బంగారు ప‌త‌కం సాధించి రాజ్‌ భ‌వ‌న్‌ కు తీసుకురావాల‌ని సింధును కోరారు. అయితే ఇక్క‌డే ఆయ‌న మాట‌ల‌ను త‌ర్కించి చూస్తే గ‌వ‌ర్న‌ర్ ను మార్చు ఆలోచ‌న‌లో కేంద్రం ఉందా..? 2020 వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్‌ గా కొన‌సాగ‌లేన‌ని ముందుగానే న‌ర‌సింహ‌న్‌ కు సంకేతాలు అందాయా..? అనేది ఇక్క‌డ చ‌ర్చనీయాంశంగా మారింది. సో తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం కావాల‌నే దిశ‌గా అడుగులు వేస్తుంది.

ఇక్క‌డ గ‌వ‌ర్న‌ర్‌ గా బీజేపీలో ప‌నిచేసిన క్రీయాశీల‌క నేత‌ల‌ను గ‌వ‌ర్న‌ర్‌ గా పంపితే బీజేపీకి లాభం చేకూరుతుంది అనేది బీజేపీ నేత‌లు ఆలోచ‌న చేస్తున్నారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్యాల‌తో తాను త్వ‌ర‌లోనే రాజ్‌ భవ‌న్‌ ను ఖాళీ చేయ‌బోతున్నాన‌నే సంకేతాలు ఇచ్చార‌నే అర్థం వ‌స్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సో త్వ‌ర‌లోనే తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ రాబోతున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చెప్ప‌క‌నే చెప్పాడ‌న్న మాట‌.