Begin typing your search above and press return to search.
నరసింహన్ 4 బిందెలు ఇస్తే 2 బిందెలు వచ్చాయ్
By: Tupaki Desk | 7 July 2016 8:20 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నా.. మంగళగిరి పానకాల స్వామి తీరే వేరు. ఇక్కడి స్వామివారిని కొలవటానికి వచ్చే ప్రతిఒక్కరూ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పానకాన్ని ప్రసాదంగా సమర్పిస్తుంటారు. ఈ సందర్భంగా స్వామికి పానకాన్ని ఇస్తారు. ఎంత పానకం పోస్తే.. అందులో సగం పానకం తిరిగి రావటం ఇక్కడ ఆనవాయితీ.
నిజానికి ఇదో మిస్టరీగా చెబుతుంటారు. స్వామికి పోసిన పానకంలో సగం తిరిగి వచ్చేదెలా అన్న అంశం మీద ఎవరికి వారు ఎన్ని లెక్కలు చెప్పినా.. అందరిని సంతృప్తి పరిచే లాజిక్ ను ఎవరూ చెప్పలేదనే చెప్పాలి. తాజాగా పానకాల స్వామి దర్శనానికి వచ్చిన గవర్నర్ నరసింహన్ తనతో పాటు నాలుగు బిందెల పానకాన్ని స్వామికి ప్రసాదంగా ఇచ్చారు. అందులో నాలుగు బిందెల పానకం పోయగా.. రెండు బిందెల పానకం తిరిగి వచ్చింది. అలా తిరిగి వచ్చిన పానకాన్ని గవర్నర్ కు తిరిగి ఇవ్వగా..ఆయన భక్తి శ్రద్ధలతో స్వీకరించి భక్తులకు పంచారు. అదండీ గవర్నర్ గారి పానకం బిందెల లెక్క.