Begin typing your search above and press return to search.
భుజం మీద చేయేసి మరీ బాబుతో మాటలు
By: Tupaki Desk | 8 July 2016 6:14 AM GMTసాధారణంగా ఒక గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య సంబంధాలుమర్యాదపూర్వకంగా.. ఇరువురి మధ్య దూరాన్ని తెలిపేలా కనిపిస్తాయి. ఎంతసన్నిహితమైనప్పటికీ ఎవరికి వారు.. వారున్న స్థానాలకు తగ్గట్లుగా వ్యవహరిస్తారే తప్పించి అందుకు ఒక అడుగు కూడా ముందుకు వేసే ప్రయత్నంచేయరు. కానీ.. అందుకు భిన్నమైన సీన్ ఒకటి కనిపించింది. తన ఏపీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. ఏపీ సీఎంతో తనకున్న చనువు ఎంతన్నది తనచేష్టలతో చెప్పకనే చెప్పేశారు.
అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఈ సీన్ లోకి వెళితే..
గవర్నర్ నరసింహన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో చెబుతుండటం ఆయన ఆసక్తిగా వినే ప్రయత్నంతో పాటు.. గవర్నర్ చేయి చంద్రబాబు భుజంమీద పడిన వైనం అందరిని ఆకర్షించింది. ఒక చేతిని నడుం మీదా.. మరోచేతిని బాబు భుజం మీద వేసిన నరసింహన్ బాబు చెప్పే మాటను జాగ్రత్తగా వింటున్నట్లు కనిపించగా.. ఏదో సీరియస్ అంశాన్ని గవర్నర్ కు బాబుచెప్పినట్లుగా కనిపించే పరిస్థితి.
ఈ మధ్య కాలంలో ఒక రాష్ట్ర గవర్నర్.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత స్నేహపూర్వకంగా.. ఇంత చనువుగా.. దగ్గరగా ఉన్నది కనిపించలేదనే చెప్పాలి. గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య ఉండే దూరాన్ని తగ్గించేస్తూ.. ఇద్దరి మధ్య ఉన్నసన్నిహిత సంబందాన్ని చాటి చెప్పేలా గవర్నర్ చర్య ఉందని చెప్పాలి.వాస్తవానికి చంద్రబాబు తొందరపడి చనువు ప్రదర్శించటం కనిపించదు. అదేసమయంలో గవర్నర్ నరసింహన్ సైతం హుందాతనానికి ప్రతీకగా నిలుస్తారేకానీ.. అనవసరమైన చనువును ప్రదర్శించరు.
తాజా సీన్ మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఆసక్తికరమైన అంశంగాచెప్పాలి. గవర్నర్ నరసింహన్ కు సీఎం చంద్రబాబుకు మధ్య దూరం పెరిగిందని.. వారి మధ్య గతంలోలా సంబంధాలు లేవన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అందుకు భిన్నంగా అందరి ముందే.. వీరిద్దరూ భుజం మీద చేయివేసుకొని మాట్లాడుకునేలా కనిపించటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. కాకుంటే ఒక్క అంశం ఏమిటంటే.. రాజకీయంగా చూసినప్పుడు ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్థాయి’కి.. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా నరసింహన్ కు మధ్య దూరం చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ.. అందుకు భిన్నంగా గవర్నర్ నరసింహన్ చనువుగా బాబు భుజం మీద చేయి వేసిన వైనంచూస్తే.. వారి మధ్య అనుబంధం ఎక్కువన్న విషయం స్పష్టమవుతుందని చెప్పకతప్పదు. ఏమైనా బాబు భుజం మీద చేయి వేయగలిగిన చనువున్న అతికొద్దిమందిలో గవర్నర్ నరసింహన్ ఒకరన్న విషయం తాజా సీన్ తో అర్థమైందనిచెప్పొచ్చు.