Begin typing your search above and press return to search.
తెలుగు గవర్నర్ కు ప్రత్యేక అధికారాలున్నాయి
By: Tupaki Desk | 23 July 2015 6:38 AM GMTవిభజన చట్టంలోని సెక్షన్ 8కు సంబంధించి భారీగా చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టానికి సంబంధించి రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు ఎవరికి వారు.. తమ తమ వాదనను వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని నేరుగా కాకుండా.. పరోక్షంగా అడిగి కేంద్రం చేత కన్ఫర్మ్ చేయించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.
ఉమ్మడి రాజధానిలోని గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఉన్న విషయాన్ని కేంద్రం పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. గవర్నర్ కు ఉన్న ప్రత్యేక అధికారాల గురించి మరోసారి స్పష్టం చేస్తూ.. ‘‘విభజన చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం పరిపాలన ఉద్దేశంతోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయ్యింది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల ప్రాణాలు.. స్వేచ్ఛ.. ఆస్తుల రక్షణ కోసం గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలు కల్పించాం’’ అని పేర్కొంది.
సెక్షన్ 8 మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో.. ఉమ్మడి రాజధానిలోని గవర్నర్ ప్రత్యేక అధికారాల గురించి కేంద్రం విస్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో.. సెక్షన్ 8 పట్ల కేంద్రం సానుకూలంగా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైనందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.