Begin typing your search above and press return to search.
కేసీఆర్ అడ్డాలో గవర్నర్ సాబ్ కు అవమానం!
By: Tupaki Desk | 1 Jan 2019 8:48 AM GMTదేశంలో ఎంతమంది గవర్నర్లు ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ సాటికి వచ్చే ఒక్కరంటే ఒక్క గవర్నర్ ఉండరు. ఆయన కాబట్టి ఇంతకాలం ఉండగలిగారు కానీ.. మరెవరైనా సరే చేతులు ఎత్తేసే పరిస్థితి. మిగిలిన గవర్నర్లతో పోలిస్తే నరసింహన్ సాబ్ కాస్త భిన్నమైన వ్యక్తి. ఆయన తీరు కాస్త వేరుగా ఉంటుంది.
విపరీతమైన భక్తి.. దేవాలయాలంటే ఆసక్తితో పాటు..ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత తిరుమలకు ఆయన ఎంత తరచూ వెళ్లే వారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
తర్వాతి కాలంలో ఆయన పర్యటనలపై విమర్శలు రావటంతో తిరుమల పర్యటనను ఆయన తగ్గించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తిరుమలను తలపించేలా యాదగిరి గుట్టను మార్చాలన్న కృతనిశ్చయాన్ని ప్రదర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యేక ఆసక్తితో ఆ దేవాలయాన్ని పూర్తిగా మార్పులు చేసి.. భారీ ఎత్తున హంగుల్ని చేర్చే ప్రయత్నంలో ఉన్నారు.
యాదగిరిగుట్ట అన్నంతనే అక్కడి నరసింహస్వామి ఎలా గుర్తుకు వస్తారో.. కేసీఆర్ గుర్తుకు వచ్చేలా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టారు. కేసీఆర్‌కు అడ్డా లాంటి యాదగిరిగుట్టకు డిసెంబరు 31న గవర్నర్ నరసింహన్ వెళ్లారు. శ్రీవైష్ణవ ఆచారాన్ని పాటించే గవర్నర్ సాబ్ కు గుట్ట పూజారులు తూతూ మంత్రంగా ఆశీర్వచనాలు ఇవ్వటంతో ఆయన కోపం నశాళానికి అంటింది.
రాష్ట్రానికి ప్రధమ పౌరుడైన తనకే తూతూ మంత్రంగా ఆశీర్వచనం పలుకుతారా? అంటూ అక్కడి వేద పండితులకు క్లాస్ పీకారు. మిగిలిన రాజకీయ నాయకులైతే.. ఆలయ ఆర్చకుల మంత్రాల్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే.. వారికి అవగాహన లేమి ఉంటుంది. కానీ.. గవర్నర్ సాబ్ వారి సంగతి వేరు. ఆయనకు పూజాదికాల మీద ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. అలాంటి ఆయన విషయంలోనూ ఆలయ అధికారులు అంత సింఫుల్ గా వ్యవహరించటంపై ఆగ్రహం వ్యక్తం క్లాస్ తీసుకున్నారు.
పండితుల తీరును అవమానంగా భావించిన గవర్నర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తనలాంటి వారికి ఆశీర్వచనం పలకటం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఆశీర్వచనంలో చతుర్వేద ఆశీర్వచనం చేయాలి కదా? అంటే క్వశ్చన్ చేశారు. గవర్నర్ సాబ్ విషయంలో తూతూ మంత్రంగా వ్యవహరించిన ఆలయ పూజారులపై చర్యలు పక్కా అన్న మాట వినిపిస్తోంది. అయినా.. ప్రముఖుల విషయంలోనే ఇంత నిర్లక్ష్యం అయితే.. సామాన్యుల మాటేంటి?