Begin typing your search above and press return to search.
మన గవర్నర్ సీటు భద్రమే
By: Tupaki Desk | 8 Aug 2015 4:50 PM GMTబీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు రాష్ర్టాలకు గవర్నర్లను నియమించింది. బీజేపీ సీనియర్ నేతలు రామ్ నాథ్ కోవింద్, ఆచార్య దేవ్ విరాఠ్‌లను గవర్నర్‌లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రామ్ నాథ్ కోవింద్ ను బీహార్ గవర్నర్‌గా, ఆచార్య దేవ్ విరాఠ్‌ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కోవింద్ రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఇప్పటివరకు బీహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో బీహార్ ఎన్నికలున్న నేపథ్యంలో గవర్నర్ ఎంపిక నిర్ణయం చర్చనీయాంశం అయింది. రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా అధనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ను ఎప్పటినుంచో మారుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన మార్పు లేకపోవడం గమనార్హం. ఢిల్లీకి హడావుడిగా వెళ్లిన గవర్నర్ ఈ ఎంపిక సమయంలో కూడా అక్కడే ఉండటం ఆసక్తికరం. మొత్తంగా ఇప్పటికైతే గవర్నర్ సీటులో నరసింహన్ ఉన్నారు.