Begin typing your search above and press return to search.
రావు గారూ.. నన్ను ఇన్వాల్వు చేయకండి సార్
By: Tupaki Desk | 26 July 2016 7:39 AM GMT చాలా రోజుల కిందట వచ్చిన ‘ఢీ’ సినిమా.. అందులో కామెడీ సీన్లు గుర్తుండే ఉండి ఉంటాయి. అప్పుడూ టీవీల్లోని కామెడీ ఛానళ్లలో ఆ సన్నివేశాలు సందడి చేస్తుండడంతో మరిచిపోయే ఛాన్సు లేదు లెండి. అందులో.. బ్రహ్మానందం - మంచు విష్ణు కాంబినేషన్లలోని సీన్లు ఒక్కసారి గుర్తు చేసుకోండి. హీరోయిన్ జెనీలియాను పడగొట్టేయాలని మంచు విష్ణు ప్లాన్లు వేస్తుండడం... దానికి సంబంధించిన విషయాలు బ్రహ్మానందంతో చెబుతుంటే ఆయన భయంతో ‘‘రావు గారూ.. నన్ను ఇన్వాల్వు చేయకండి సార్’’ అంటుండడం నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లోనూ ఓ వివాదం విషయంలో గవర్నరు నరసింహన్ పాపం ఇలాగే దయచేసి నన్ను ఇరికించొద్దు అంటూ తప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గొడవల్లో నేను తలదూర్చను బాబోయ్ అంటున్నారు.
కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాలు రెండింటి మధ్య నెలకొన్న వివాదంలో తాను జోక్యం చేసుకోబోనని ఏపీ - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే ఎలాంటి వివాదాలనైనా పరిష్కరించేందుకు రాష్ట్ర విభజన చట్టంలో తగిన వేదికలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెబుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్యాంగాధినేత పదవిలో నాలుగేళ్లు పూర్తిచేసుకొన్న సందర్భంగా సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన విందుకు హాజర్యయేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీని - ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ - న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లను కలుసుకొని చర్చలు జరిపారు. ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రాష్ర్టాల మధ్య వివాదాల పరిష్కారం తన బాధ్యత కాదని.. అందుకు వేదికలు ఉన్నాయని చెప్పారు. కృష్ణా నదీజలాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలలో తాను అసలు తలదూర్చబోనని చెప్పారు.
అయితే.. కృష్ణానది జలాల గొడవలో జోక్యం చేసుకోబోనని చెప్పిన గవర్నరు కృష్ణా పుష్కరాలపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. కృష్ణా జలాల వివాదంపై ఏమీ మాట్లాడని ఆయన కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ గడువులోగా పూర్తవుతాయన్న చెప్పడం విశేషం. కృష్ణా నది వెంట రెండు రాష్ట్రాలలోనూ పుష్కరాల ఏర్పాట్లు చక్కగా సాగుతున్నాయని ఆయన కితాబునిచ్చారు. అలాగే... తెలంగాణలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేసిన విషయం, గాలిలోకి కాల్పులు జరిపిన విషయం కూడా ఆయనకు తెలియదట.